ఆ టీడీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించే దిశగా జగన్?

Update: 2021-06-11 05:30 GMT
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఫిరాయించిన తెలుగు దేశం పార్టీ శాసనసభ్యులను తమ అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేయాలని.. ప్రజల మద్దతుతో మళ్లీ గెలిపించాలని తాజాగా  ఆలోచిస్తున్నట్టు తెలిసింది.

మీడియాలో వస్తున్న ఊహాగానాల ప్రకారం, తెలుగు దేశం పార్టీని మరింతగా దెబ్బతీయడానికి.. అలాగే ప్రజల్లో తన పాలన పట్ల మద్దతును మరింతగా నిరూపించడానికి జగన్ ఈ ఆలోచనకు వచ్చారని తెలిసింది. వైయస్ఆర్సి అధికారంలో ఉన్నందున, ఉప ఎన్నికలలో సహజంగానే ప్రయోజనం ఉంటుంది.

ప్రస్తుతం  కనీసం నలుగురు టిడిపి ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి వైసీపీ తరుఫున తిరిగి గెలిపించాలని జగన్ యోచిస్తున్నట్టు తెలిసింది. గన్నవరం నుండి వల్లాభనేని వంశీ, చీరాల నుండి కరణం బలరాం, గుంటూరు (పశ్చిమ) నుండి మద్దాలి గిరిధర్ మరియు విశాఖపట్నం (దక్షిణ) నుండి వాసుపల్లి గణేష్ - వైయస్ఆర్సికి ఫిరాయించినప్పటికీ వారి అసెంబ్లీ స్థానాలకు రాజీనామా చేయలేదు. ఇప్పుడు వారిచేత చేయించడానికి జగన్ రెడీ అయినట్లుగా తెలిసింది.

వారు ఇప్పటికీ సాంకేతికంగా టిడిపితోనే ఉన్నారనే వాస్తవం వైయస్ఆర్సి నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు చిరాకుపెడుతూనే ఉంది. ఈ ఎమ్మెల్యేలు తమ సీట్లకు రాజీనామా చేసి వైయస్ఆర్సి టిక్కెట్లపై ఎన్నికైతే అది జగన్‌కు పూర్తి విశ్వాసాన్ని ఇస్తుంది. పార్టీని మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నట్టు తెలిసింది.

ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతంలో .. దాని పరిసరాల్లోకి వచ్చే నియోజకవర్గాల ప్రజల నుండి తన మూడు రాజధానుల ప్రణాళికకు తమ మద్దతు ఉందని నిర్ధారించడానికి ముఖ్యమంత్రి ఈ ఎన్నికల ద్వారా పూర్తి ఆమోదం కోరుకుంటున్నారు. ఈ నియోజకవర్గాలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో వైయస్ఆర్సి గెలిచినప్పటికీ, ఇది ప్రజల ఆదేశాన్ని పూర్తిగా ప్రతిబింబించదని అంటున్నారు..

అందువల్ల అమరావతికి సమీపంలో ఉన్న గన్నవరం, గుంటూరు (పశ్చిమ) మరియు చీరాలలో వైయస్ఆర్సికి విజయం జగన్ కు ధైర్యాన్ని పెంచేది. కాబట్టి విశాఖపట్నం (దక్షిణ) లో విజయం సాధ్యమేనంటున్నారు.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కారణాల వల్ల అసెంబ్లీ సభ్యత్వం నుంచి వైదొలిగిన విశాఖపట్నం (ఉత్తరం) ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు రాజీనామాను కూడా అంగీకరిస్తే, అది వైయస్ఆర్సిని మరింత బలోపేతం చేస్తుంది. తాను ఉప ఎన్నికలలో పోటీ చేయనని గంటా ఇప్పటికే ప్రకటించాడు. దీంతో ఈ వైయస్ఆర్సి సీటు గెలవడం చాలా సులభం.

ఉప ఎన్నికలలో వైయస్ఆర్సి ఈ స్థానాలను గెలుచుకున్న తర్వాత, జగన్ మూడు రాజధానులను ఏర్పాటు చేసే చట్టబద్ధతను కలిగి ఉంటాడు. ప్రజా మద్దతుతో ఇది చేసినట్టు అవుతుంది.  వైఎస్‌ఆర్‌సికి ఫిరాయించే ముందు తమ పార్టీ నుంచి వైదొలగాలని టిడిపి శాసనసభ్యులకు ఇది సందేశం పంపుతుంది.
Tags:    

Similar News