బాబూ రాజేంద్రప్రసాద్... సర్వేపల్లి రాధాకృష్ణన్.... అబ్దుల్ కలాం.. ప్రణబ్ ముఖర్జీ వంటి ఎందరో హేమాహేమీలు అలంకరించిన సర్వోన్నత పదవి అది. ప్రతి ఒక్కరూ మేధావులే.. రాజనీతివేత్తలు - విద్యావేత్తలు - ఆర్తికవేత్తలు - శాస్త్రవేత్తలు - మానవతావాదులు... ఇలా ఒక్కొక్కరు ఒక్కో గుర్తింపు భారత దేశ రాష్ర్టపతి పదవిలో ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ఎక్కువగా రాజకీయ రంగం నుంచే వచ్చినప్పటికీ రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని అబ్దుల్ కలాం వంటివారు ఆ పదవికి మరింత వన్నె తెచ్చారు. కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుత రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ కూడా రాజనీతివేత్తగా - ఆర్థికవేత్తగా లబ్ధ ప్రతిష్ఠులే. యూపీఏ హయాంలో ఆయన రాష్ట్రపతి పదవి చేపట్టినప్పటికీ అనంతరం వచ్చిన ఎన్డీయే పాలనలోనూ ఆయన అందరికీ ఆమోదయోగ్యుడిగా కొనసాగుతున్నారు. అలాంటి పదవిని ప్రణబ్ తరువాత ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ చేపడతారని కొత్త ప్రచారం ఒకటి మొదలవుతోంది. ఇందులో నిజానిజాలు - సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నా కూడా అమితాబ్ ఆ పదవికి సూటవ్వరన్న వాదన వినిపిస్తోంది. నటుడిగా - ప్రముఖుడిగా అమితాబ్ కు దేశ్యాప్తంగా పేరుంటే ఉండొచ్చు కానీ, రాష్ట్రపతి పదవికి మాత్రం సరిపోరని అంటున్నారు.
గతంలోనూ ఎన్డీయే హయాంలోనే రాజకీయాలతో సంబంధం లేని కలాంను రాష్ర్టపతి పదవిలో కూర్చోబెట్టారు. భారతదేశ క్షిపణి పితామహుడిగా పేరున్న కలాం గొప్ప శాస్త్రవేత్తే కాదు గొప్ప మానవతావాది. ఆదర్శనీయుడు - స్పూర్తి ప్రదాత - నిరాడంబరుడు - వివాదరహితుడు. ఆయన ఎంపికపై ఎవరికీ అభ్యంతరం లేకపోయింది.
అమితాబ్ విషయానికొచ్చేసరికి పరిస్థితి వేరు. అమితాబ్ దేశం గర్వించదగ్గ నటుడే కావొచ్చు. కానీ, కలాంతో పోల్చితే ఆ పదవికి సరిపోరు. అంతేకాదు... బీజేపీలోనే సుదీర్ఘ అనుభవం ఉన్న అద్వానీ ఉన్నారు. ఆయన రాజనీతి - నాలెడ్జి - అనుభవం - ప్రజాసంబంధాలు వంటివన్నీ పరిగణనలోకి తీసుకుంటే అలాంటివారి ముందు అమితాబ్ దిగదుడుపే. ఒకప్పుడు కాంగ్రెస్ తో మంచి అనుబంధమే ఉన్న అమితాబ్ అనంతర కాలంలో ఆ పార్టీకి దూరమయ్యారు. బోఫోర్సు కుంభకోణంలోనూ అమితాబ్ పేరు ఉంది.
ఇక అమితాబ్ పేరు రాష్ట్రపతి పదవికి పరిశీలనలో ఉందటున్న అమర్ సింగ్ మాటలు కూడా పూర్తిగా నమ్మడానికి లేదు. అమితాబ్ ను ప్రమోట్ చేయడం కోసం ఆయన ఈ మాట చెప్పి ఉండొచ్చన్న వాదనా వినిపిస్తోంది. ఏదైనాసరే అమితాబ్ వీరాభిమానులు కూడా అమితాబ్ ను ఆ ఉన్నత పదవిలో ఊహించలేకపోతున్నారు. ఒకవేళ నిజంగానే బీజేపీ ఇలాటి నిర్ణయం తీసుకుంటే మాత్రం ఆ పార్టీ నవ్వులపాలు కావడం ఖాయం.