రేవంత్ నమ్మిన ఆ అదృష్టగది.. గట్టెక్కిస్తుందా?

Update: 2021-07-17 05:30 GMT
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా గద్దెనెక్కగానే గాంధీ భవన్ లో వాస్తు మార్పులు చేయించిన వైనం చర్చనీయాంశమైంది. గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ కూర్చొనే గదిని కూడా రేవంత్ మార్పు చేయించారు. ఈ గది రేవంత్ రెడ్డికి అదృష్టం తెచ్చిపెడుతుందని జ్యోతిష్యులు చెప్పినట్టు టాక్. ఎవరైతే ఈ గదిలో కూర్చుంటారో వారు అనుకున్నది సాధిస్తారని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. గదికి ఆ మహత్య్మం ఉందంటున్నారు.

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాగానే కాంగ్రెస్ ను తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలని తద్వారా సీఎం కావాలని కలలుగంటున్నాడు. వాస్తవానికి తూర్పు గేట్ దగ్గర ఉన్న గాంధీ భవన్ లోని మూలకు ఉన్న రూమ్ లో భట్టి విక్రమార్క కూర్చునేవాడు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడిగా ఉన్నాడు. అంతకుముందు కుసుమకుమార్ ఈ గదిలో కూర్చునేవాడు. ఆ గదిలో కూర్చున్న మహత్య్మం ఏంటో తెలియదు కానీ.. అతడు ఏఐసీసీకి ఎదిగాడు. ఇప్పుడు ఏఐసీసీలో అతడో ముఖ్యమైన వ్యక్తి. చాలా కాంగ్రెస్ వివాదాల్లో మధ్యవర్తిగా.. చర్చలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

అంతకుముందు రేవంత్ రెడ్డి కూడా ఈ గదిని తనకు అదృష్టమని గట్టిగా నమ్ముతున్నాడు. అనేక మంది జ్యోతిష్యులు, వాస్తు నిపుణులు కూడా రేవంత్ ఈ గదిని పీసీసీ చీప్ గా తన గదులను మార్చాలని సూచించారు. దీని ప్రకారం రేవంత్ రెడ్డి గదిలో అనేక మార్పులు చేశాడు. దీనిని తన గదిలోకి మార్చాడు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ కాగా.. తూర్పు మూలలో ఉన్న రెండో గదిని తన కార్యాలయంగా ఉపయోగించారు. ఉత్తమ్ హయాంలో కాంగ్రెస్ పార్టీ పరిస్తితి మరింతగా దిగజారింది. ఫిరాయింపులు, విభేదాలను ఎదుర్కొందని వాస్తు నిపుణులు అంటున్నారు.

రేవంత్ రెడ్డి ఇప్పుడు అదృష్టగది అయిన కొత్త గదిని ఎంచుకున్నారు. ఎందుకంటే అతడు సరైన గదిని ఎంచుకున్నాడు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించిన వెంటనే రేవంత్ రెడ్డి గాంధీ భవన్ కు అనేక మార్పులు చేశారు. చాలా గదులు కూడా మార్పులు చేసి పునరుద్దరించబడ్డాయి. కొత్తగా తూర్పు ద్వారా తెరవబడింది. రేవంత్ రెడ్డి తన గదికి చేరుకోవడానికి ఈ తూర్పు ద్వారంనే ఉపయోగిస్తున్నారు.

పీసీసీ చీఫ్ గా అధిష్టానం ప్రకటించిన వెంటనే రేవంత్ రెడ్డి గాంధీ భవన్ లోని వాస్తుదోషంపై దృష్టిపెట్టారు. తూర్పు వైపు మరో ద్వారం ఏర్పాటు చేస్తున్నారు. పీసీసీ చాంబర్ తూర్పులో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. గాంధీ భవన్ లోని ప్రచార సామగ్రి ఉండే గదిని తొలగిస్తున్నారు. ఆయన అనుచరులు ఈ మార్పులన్నీ దగ్గరుండి రాత్రి పగలూ తేడా లేకుండా చేశారు.. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నాక ఇందులోనే బాధ్యతలు చేపట్టారు. వాస్తు దోషం లేకుండా కుర్చీలో కూర్చున్నారు.

ఇలా రేవంత్ సైతం వాస్తు నమ్మకాన్ని ఇంతలా పాటిస్తారా? అన్న విషయం ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఆయన అనుకున్న గదిలో మరి అందలం ఎక్కుతారా? లేదా అన్నది వేచిచూడాలి.

Tags:    

Similar News