తెలంగాణ రాష్ట్రం లో మున్సిపల్ ఎన్నికలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. 120 మున్సిపాలిటీల్లోని 2,727 వార్డులకు, తొమ్మిది కార్పొరేషన్ల లోని 325 వార్డులకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. నామినేషన్లకు చివరి రోజు కావడంతో చాలామంది అభ్యర్థులు బారులు తీరారు. ఉదయం 10.30 గంటలకు ముందు నుంచే కార్యాలయాలకు చేరుకొని దరఖాస్తులు దాఖలు చేశారు. అయితే,చివరి రోజు టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఊహించని షాక్ ఇచ్చారు. టీఆర్‌ఎస్ ఫీర్జాదిగూడలో మున్సిపల్ కార్పొరేషన్ ఇన్‌చార్జి దయాకర్‌రెడ్డికి పార్టీ బీ ఫాం అందించి షాక్ ఇచ్చారు.
టీఆర్ఎస్ నేత అయిన దయాకర్ రెడ్డి పార్టీ టికెట్ ఆశించారు. అయితే, టీఆర్‌ఎస్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో ఉదయం మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరాడు. అనంతరం రేవంత్ ఆయనకు బీఫాం ఇచ్చారు. దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కు బుద్ధిచెబుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. పార్టీ నేత కాంగ్రెస్ లో చేరాడని తెలియగానే మంత్రి మల్లారెడ్డి కి టీఆర్ఎస్ పెద్దలు అలర్ట్ చేసినట్లు సమాచారం. దీంతో మల్లారెడ్డి, ఆయన అల్లుడు, రేవంత్ చేతిలో ఓటమి పాలయిన మర్రి రాజశేఖర్ రెడ్డి కలిసి హుటాహుటిన దయాకర్ ఇంటికి చేరుకున్నారు. 'పార్టీ నీకు న్యాయం చేస్తుంది. ఎలాంటి పదవులు కావాలో చెప్పు, నేను చూసుకుంటా' అంటూ మంత్రి మల్లారెడ్డి బుజ్జగించారు. వారు చర్చిస్తున్న క్రమంలో ఎంపీ రేవంత్ వస్తున్నారనే సమాచారం మేరకు దయాకర్‌రెడ్డిని మంత్రి తన కారులో తీసుకెళ్లి పోయారు.
ఈ నాటకీయ పరిణామాల నడుమ తిరిగి మంత్రి సమక్షం లో సాయంత్రానికి టీఆర్‌ఎస్ లో చేరి పోయాడు. ఈ ఘటన పై మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ డబ్బు రాజకీయాల్లో మల్లారెడ్డి ఘనాపాటి అని విమర్శించారు. ఈ ఎన్నికల్లో కష్టపడిన వారికి కాకుండా వేలం పాట లో ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికే టీఆర్‌ఎస్ పార్టీ బీఫామ్‌లు ఇస్తున్నదని ఆరోపించారు. త్వరలోనే ఆ పార్టీకి నూకలు చెల్లుతాయనీ, మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలనీ అన్నారు. కాగా, చివరి నిమిషంలో కేసీఆర్ ఆండ్ టీంకు రేవంత్ ఊహించని షాక్ ఇచ్చారని అంటున్నారు.