అమ్మ పెట్టా పెట్టదు.. అడక్కతినానీయదన్నట్లుగా ఉంటాయి కొన్ని రాజకీయ పార్టీల అధినాయకత్వాలు. వారు పూనుకోరు. ఎవరైనా లీడరు పూనుకొని ముందుకు వస్తే..వారిని పరిమితుల తాళ్లతో కట్టేసి అడుగు ముందుకు వేయకుండా అడ్డుకుంటూ ఉంటారు.తాజాగా అలాంటి పరిస్థితే నెలకొంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డికి. పార్టీని అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా పని చేస్తున్నారు రేవంత్ రెడ్డి.
ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఆయన డీఎన్ ఏ విషయంలో కాంగ్రెస్ లోని పలువురు నేతలకు ఉన్న అభ్యంతరాలు అన్ని ఇన్ని కావు. అధిష్టానం అన్ని పరీక్షలు పెట్టి.. రేవంత్ ను ఫైనల్ చేసి ప్రకటించిన తర్వాత కూడా ఆయనకు నిత్యం ఏదో ఒక అగ్నిపరీక్ష ఎదురయ్యేలా చేస్తుంటారు కాంగ్రెస్ నేతలు.
ప్రస్తుతం ఆయన టార్గెట్ మొత్తం వరంగల్ లో పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ టూర్ ను సక్సెస్ చేయాలని కంకణం కట్టుకున్నారు. సభను భారీసక్సెస్ చేయటం ద్వారా రాహుల్ దగ్గర మార్కులు కొట్టేయటంతో పాటు.. తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లోకొత్త ఉత్సాహాన్ని నింపాలని ఆయన భావిస్తున్నారు. దీంతోపాటు చిరకాలంగా తన మనసులోని పాదయాత్రకు అధినాయకత్వం నుంచి ఆమోదముద్ర కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే తెలంగాణలో బీజేపీ పార్టీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర చేస్తుంటే.. టీవైసీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా పాదయాత్ర చేస్తున్నారు. వీరిద్దరికి భిన్నంగా మాజీ ఐపీఎస్ ప్రవీణ్ చేసుకుంటూ పోతున్నారు. ఇలాంటి వేళ.. తాను పాదయాత్ర చేయాలని రేవంత్ భావించినా పార్టీ అధినాయకత్వం నుంచి అనుమతి రాకపోవటంతో ఇప్పుడు ఆయన సరికొత్త ఆలోచనలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మహానగర పరిధిలోని 23 నియోజకవర్గాల్ని మినహాయించి.. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇందుకోసం ఏ రోజుకు ఆ రోజు హైదరాబాద్ నుంచి వెళ్లి.. ముందుగా అనుకున్న నియోజకవర్గంలో పాదయాత్ర చేసి.. రాత్రికి హైదరాబాద్ కు వచ్చేలా చేయాలన్నది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. ఇందుకోసం తనకు119రోజులు సరిపోతాయని చెబుతున్నారు. పాదయాత్రే కానీ పాదయాత్రకాకుండా డిజైన్ చేసిన దీనికి కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఓకే చేస్తుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
రేవంత్ చెప్పినట్లుగా 119 రోజుల్లో తెలంగాణలోని నియోజకవర్గాల్లో (హైదరాబాద్ పరిధిలోనివి మినహాయించి) పాదయాత్ర సాధ్యమా? అన్నదానిపై చర్చజరుగుతుంది. అయితే.. పాదయాత్రకు సంబంధించి హైకమాండ్ నుంచి ఎలాంటి సంకేతాలు రాని నేపథ్యంలో..రేవంత్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. రేవంత్ కు కల అయిన పాదయాత్రను మిగిలిన వారిలా చేస్తారా? లేదంటే.. తాను డిజైన్ చేసుకున్న దానికి అధినాయకత్వం ఓకే అంటుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మరేం జరుగుతుందో చూడాలి.