ఏపీ శాసనసభ నుంచి వైసీపీ ఎమ్మెల్యే రోజాను గత ఏడాగి సంవత్సరం పాటు బహిష్కరించిన తరువాత ఆమెను గేటు బయటే ఆపేసిన ఘటన గుర్తుండే ఉంటుంది. హైదరాబాద్ లో ఏపీ అసెంబ్లీ ఎదురుగా రోడ్డుపైనే ఆమె కూర్చోవడం అప్పట్లో అందరినీ కదిలించి వేసింది. టీడీపీ అంత కఠినంగా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే... ఇప్పుడు అదే టీడీపీ సభ్యులకు తెలంగాణలో ఇలాంటి అనుభవమే ఎదురైంది. తెలంగాణ అసెంబ్లీలో ఆధిక్యం ఉన్న టీఆరెస్ ఈ రోజు టీటీడీపీ నేతలు రేవంత్ రెడ్డి - సండ్ర వెంకటవీరయ్యలను సభలోకి రానివ్వకపోవడంతో వారికీ రోడ్డే గతి అయింది.
ఎస్టీ - మైనారిటీలకు మతపరమైన రిజర్వేషన్ల కోటాను పెంచుతూ, తెలంగాణ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి, బిల్లుపై చర్చించనున్న వేళ - తెలుగుదేశం సభ్యులు రేవంత్ రెడ్డి - సండ్ర వెంకట వీరయ్యలను అసెంబ్లీలోనికి అనుమతించలేదు. వారిపై సస్పెన్షన్ వేటు ఉన్న కారణంగా, స్పీకర్ అనుమతి లేనిదే లోనికి పంపలేమని భద్రతాధికారులు స్పష్టం చేయడంతో, వారు రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
గాంధీ విగ్రహం ముందున్న ఇనుప కంచెకు ఇవతలి వైపున 'తెలంగాణలో రాజ్యాంగాన్ని కాపాడండి - తెలుగుదేశం పార్టీ' అని రాసున్న బ్యానర్ ను ప్రదర్శిస్తూ, వారు తమ నిరసనను తెలియజేస్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి అసెంబ్లీకి పాదయాత్రను ప్రారంభించడంతో, పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు - వారిని బలవంతంగా పోలీసు స్టేషనుకు తరలించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/