మల్కాజిగిరిలో గెలుపుకోసం రేవంత్ స్కెచ్

Update: 2019-03-17 10:49 GMT
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మల్కాజిగిరి నుంచి పార్లమెంట్ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తన గెలుపు కోసం ఇప్పుడే వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. మల్కాజిగిరిలో సీపీఐ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిసి వారి మద్దతు కోసం తాజాగా స్కెచ్ గీశారు.

ఆదివారం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ అరాచక పాలన అంతం కావాలంటే కామ్రేడ్లు అవసరమని.. వారి మద్దతు ఉంటే తాను తప్పకుండా గెలుస్తానని అన్నారు. అందుకే ఆదివారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం ముఖ్ధుం భవన్ కు రేవంత్ వెళ్లారు. తనకు మల్కాజిగిరిలో మద్దతు ఇవ్వాలని సీపీఐ నేతలను కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ బీజేపీ హఠావో అన్న కేంద్ర కమిటీ సూచన మేరకు తాము లౌకిక శక్తులకు మద్దతు ఇస్తామని.. అందుకే రేవంత్ కు సపోర్టు చేస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్, మోడీ బొమ్మ బొరుసులాంటి వారని ఆరోపించారు. సినిమాలో గచ్చిబౌలి దివాకర్ లా.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఓ జోకర్ అని విమర్శించారు. కేసీఆర్, మోడీని ఓడించాలంటే కమ్యూనిస్టుల సహకారం అవసరమన్నారు.

పోయిన ఎన్నికల్లో 10 మంది గెలిచినా కేసీఆర్ ఏం సాధించలేదని..ఇప్పుడు ఏం చేయరని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు ఓటేస్తే.. మోడీకి అమ్ముకుంటారని విమర్శించారు. కేసీఆర్ వింత రోగంతో బాధపడుతున్నారని.. రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇలా అనిపిస్తోందన్నారు. అందుకే సంఖ్యా బలం ఉనప్పటికీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని విమర్శించారు.


Tags:    

Similar News