తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరోమారు మీడియా ముందుకు వచ్చారు. ఈ దఫా గులాబీ దళపతి - అపద్ధర్మ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. తన నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించిన రేవంత్ రెడ్డి పలు అంశాలపై తనదైన శైలిలో స్పందించారు. తనపై ఐటీ దాడులు జరిగినప్పుడు తన ఆస్తులు వేల కోట్లలో ఉన్నట్టు టీవీ9 - టీన్యూస్ - నమస్తే తెలంగాణ పత్రికలు ద్వారా తప్పుడు ప్రచారం చేయించారని ఆయన మండిపడ్డారు. ``ఈ మూడు ప్రసార మాధ్యమాలు ప్రసారం చేసిన ప్రచారం ఆధారంగా తనను ఐటీ అధికారులు వేధించారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ నష్టం చేకూర్చి - టీఆర్ ఎస్ కు లాభం చేకూర్చేలా టీవీ9 మేజర్ షేర్ హోల్డర్ అయిన రామేశ్వర్ రావు కుటుంబం - టీన్యూస్ - నమస్తే తెలంగాణ వెంటనే తన గురుంచి ప్రచురించిన తప్పుడు వార్తలు తప్పు అని మరోసారి టీవీలో ప్రచురించాలి. బహిరంగ క్షమాపణ చెప్పాలి.లేదంటే కోర్టు వద్ద తేల్చుకుందాం అని యాజమాన్యానికి హెచ్చరిస్తున్న. 24గంటల సమయం ఇస్తున్నా. లేదంటే కోర్టును ఆశ్రయిస్తా` అని రేవంత్ ప్రకటించారు.
ఈ సందర్భంగా తనను కలవరపాటుకు గురిచేస్తున్న ఓటుకునోటు కేసుపై రేవంత్ ఘాటుగా రియాక్టయ్యారు. ఓటుకు నోటు అంటున్న కేసీఆర్ దమ్ముంటే ఎం పీకుతాడో పీకమను అంటూ రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ``నన్ను దాటి చంద్రబాబు దగ్గరికి పోవాల్సింది. మొదట కేసీఆర్ నన్ను దాటమను. కేసీఆర్ దేశ ముఖ్యమంత్రులలో అధముడు. ఆంధ్రవాళ్ళు అంటున్న కేసీఆర్ అక్కడి కాంట్రాక్టర్లకు మేలు చేయడం లేదా? చినజీయర్ స్వామిని తెచ్చి కుర్చీల కూర్చోబెట్టి తెలంగాణ ప్రజలను అవమానపరుస్తున్నావు కేసీఆర్.`` అంటూ మండిపడ్డారు. చంద్రబాబును టార్గెట్ లాగా కేసీఆర్ మాట్లాడుతున్నాడని ఆయన విమర్శించారు. చంద్రబాబుకు తెలంగాణలో ఓటు కూడా లేదని అయినా బాబు గురించి మాట్లాడుతున్నాడని రేవంత్ తప్పుపట్టారు. `తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డ మీద. తెలంగాణ టీడీపీకి అధ్యక్షత వహిస్తున్నది తెలంగాణ నేతనే. అయినా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ చాలా హీనంగా మాట్లాడుతున్నాడు కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో టీఆర్ ఎస్-కాంగ్రెస్ కు మధ్యే పోటీ. ప్రజల హక్కు కోసం అందరూ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన అంశాలను నెరవేర్చలేదు కాబట్టి ఈ రోజు ప్రజలు గమనించాలి`` అని కోరారు.
చావుదగ్గరికి వెళ్లి తెలంగాణ తెచ్చిన అంటున్న కేసీఆర్ కు సూటిగా ప్రశ్నలు అంటూ రేవంత్ పలు అంశాలను లేవనెత్తారు. ``తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమకారులపై 2011 సంవత్సరం నుండి 2014 వరకు 3152 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటివరకు ఉపసంహరించిన మొత్తం కేసులు 1150 వరకు ఉండగా ఇందులో టీఆరెస్ నాయకుల సన్నిహితులవే ఎక్కువ. ఉద్యమం సమయంలోని రైల్వే కేసుల్లో కేంద్ర సంస్థ అయిన రైల్వే శాఖ కేవలం కేసీఆర్ కుటుంబంపైన ఉన్న కేసులు ఎత్తివేశారు. రైల్వే సంస్థ కేవలం కేసీఆర్ కుటుంబంపై మాత్రమే ప్రేమ చూపించింది. విద్యార్థుల పైన ఉన్న కేసులు ఎందుకు ఎత్తివేయడం లేదు? తెలంగాణ ప్రజలందరూ నా బిడ్డలు అంటున్న కేసీఆర్,నీ కూతురు కవిత కొడుకు పైన చూపిన ప్రేమ మిగతావారిపై ఎందుకు చూపించడం లేదు?`` అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ``కేసీఆర్ కు వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి? టీవీ చానెల్ ఎలా వచ్చింది? పేపర్ ఎలా వచ్చింది?`` అని నిలదీశారు.