తెలంగాణ బడ్జెట్ పై టీటీడీపీ ఫ్లోర్ లీడర్ రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. తప్పుడు అంకెలతో మాయమాటలు చెప్పారని కొట్టిపారేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. రుణ మాఫీ లక్ష రూపాయల వరకు చేస్తామని చెప్పి మొండిచేయి చూపారని ఆరోపించారు. ప్రభుత్వం రైతులకు సరిగా రుణ మాఫీ నుండి విముక్తి కల్పించలేదని పేర్కొన్నారు. అంతేకాకుండా రైతుల నెత్తిమీద ప్రభుత్వం చేసిన అప్పు 11 వేలు ఉందని రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కేజీ టు పీజీ ఉచిత విద్య పైన ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలులో పూర్తిగా విఫలమైందని, కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం 19 కోట్లు మాత్రమే ప్రకటించిందని తద్వారా బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం విలాసవంతమైన జీవితం కోసం 1000 కోట్లు కేటాయించుకున్నాడని... రాష్ట్రంలో 58 శాతం వున్నా ఎంబీసీ వారికి 1000 కోట్లు కేటాయించారంటే ఆయన ప్రేమ అర్థం చేసుకోవచ్చునని రేవంత్ రెడ్డి ఆయన ఆరోపించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో కూడా ప్రజలను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. బడ్జెట్ లో డబల్ బెడ్ రూమ్ ఇళ్లకు సరైన నిధుల కేటాయింపు జరగలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. 4 లక్షల కోట్ల మంది గిరిజనులకు భూమి పంపిణి కోసం ఒక్క రూపాయి కేటాయింపు లేదని ఆరోపించారు. ఎస్సీ - ఎస్టీ - బీసీ సబ్ ప్లాన్స్ తుంగలో తొక్కేశారని విమర్శించారు. బడ్జెట్ నిరుద్యోగులు - విద్యార్థులు - ఎస్సీ - ఎస్టీ - బీసీ - మైనార్టీ వర్గాలకు మేలు చేసేలా లేదన్నారు. బడుగు బలహీన వర్గాలు వ్యతిరేక బడ్జెట్ లా కనిపిస్తోందని తెలిపారు. ఈ బడ్జెట్ దనికులకు .. బడా వ్యాపారుల సంక్షేమానికి మాత్రమే లాభం చేకూర్చేలా ఉందన్నారు. బడ్జెట్ లో ప్రభుత్వం చెప్తున్నా విషయాలన్నీ బోగస్ అని ఆరోపించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/