తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుబట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేసిన కొత్త జిల్లా ప్రక్రియపై టీడీపీ తెలంగాణ వర్మింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోమారు తనదైన శైలిలో స్పందించారు. రాజకీయ దురుద్దేశాలతో ఆశాస్త్రీయ పద్దతుల ద్వారా జిల్లాలను - మండలాలను విభజించి సీఎం కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని భారత రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. పథకం ప్రకారం నియోజకవర్గాల డిలిమిటేషన్ జరగక ముందే జిల్లాలను విభజించి ప్రస్తుతం డీలిమిటేషన్ కోసం కేంద్రం పై ఒత్తిడి తీసుకు రావడానికి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగానే 2004 నాటికి ఉనికిలో ఉన్న జిల్లాలు - మండలాల ప్రాతిపదికనే నియోజకవర్గాల డిలిమిటేషన్ను జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. జిల్లాల ఆశాస్త్రీయ విభజన - దాని వెనుక ఉన్న రాజకీయ దురుద్దేశాల గురించి రేవంత్ భారత రాష్ట్రపతితో పాటు ప్రధాన మంత్రికి - కేంద్ర న్యాయశాఖ - హోంశాఖల మంత్రులకు - జాతీయ ఎన్నికల కమిషన్‌కు కూడా రేవంత్ రెడ్డి ఫిర్యాదులు పంపారు. నవంబర్ 16 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రపతితో పాటు ఇతర ప్రముఖులను స్వయంగా కలిసి ఫిర్యాదు చేయడానికి అపాయింట్ మెంట్ల కోసం ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయా రాజ్యాంగ అంశాలను ఉదహరిస్తు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. నియోజకవర్గాల పునర్ విభజనకు సంబంధించిన అంశాలపై అవగాహన ఉన్న కేసీఆర్ తాను అనుకున్న విధంగానే కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడాలన్న కుట్రతో జిల్లాలను అశాస్త్రీయంగా విభజించారని రేవంత్ పేర్కొన్నారు. జిల్లాల ఏర్పాటుకు జనాభా - పరిపాలన సౌలభ్యం - మౌలిక వసతులు లాంటి ఏ అంశాన్ని కూడా ప్రాతిపదికగా తీసుకోలేదని విమర్శించారు. కొన్ని జిల్లాల జనాభా ఆరు నుంచి ఏడు లక్షలు ఉంటే మరికొన్ని జిల్లాల జనాభా 10 నుంచి 20 లక్షల దాకా ఉందని, ఇంకొన్ని జిల్లాలలో జనాభా 20 లక్షలు నుంచి 40 లక్షల దాకా ఉందని రేవంత్ గురు చేశారు. పరిపాలన సౌలభ్యం ప్రతిపాదికన కాకుండా కేవలం ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను దెబ్బతీయడమే లక్ష్యంగా పాత జిల్లాలను విభజించారని రేవంత్ ఆరోపించారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఒక రకంగా ఇచ్చి ఫైనల్ నోటిఫికేషన్ మరోరకంగా పూర్తి చేశారని, ఇదంతా కేసీఆర్ వ్యూహంలో భాగమేనని ఆరోపించారు. కొత్త నియోజకవర్గాల ఏర్పాటులో సగటు జనాభా 10% అటు, ఇటుగా ఉండవచ్చు అన్న వెసులుబాటును పావుగా చేసుకొని తమకు బలం లేని ప్రాంతాలలో కొత్త నియోజకవర్గాల జనాభా ఎక్కువ ఉండే విధంగానూ, తమ పార్టీ నేతలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో తక్కువ జనాభ ఉండే విధంగా కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు చేయించడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని రేవంత్ పేర్కొన్నారు.
తెలంగాణ అపాయింటెడ్ డే సమయానికి ఉన్న 10 జిల్లాలను కేసీఆర్ ఎలాంటి శాస్త్రీయ పద్దతులను ప్రాతిపదికగా తీసుకోకుండా 31 జిల్లాలుగా విభజించారని, కేవలం రాజకీయ దుర్దేశాలతోనే ఆయన కొత్త జిల్లాల పరిధులను నిర్ణయించారని రేవంత్ ఆరోపించారు. కేవలం టీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరే విధంగా మాత్రమే ఈ ఉందన్నారు. డిలిమిటేషన్కు ముందుగా జిల్లాలు - రెవిన్యూ డివిజన్లు - మండలాల పరిధులను మార్చేయడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, పునర్విభజన చట్టాన్ని ఆమోదించిన పార్లమెంట్‌ను అవమానించడమేనని రేవంత్ ఈ లేఖలో పేర్కొన్నారు. అదే విధంగా ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలను ఒకటి కంటే ఎక్కువగా జిల్లాలో ఉండే విధంగా వాటి పరిధులను మార్చి వేశారని, రెవిన్యూ డివిజన్లలను కూడా ఇష్టానుసారంగా మార్చారని, ఈ విషయంలో కనీసం సగటు జనాభాను కూడా ప్రాతిపదికగా తీసుకోలేదని విమర్శించారు.జిల్లాల పరిధులు, మండలాల పరిధులు మారిపోయిన కారణంగా ఎస్సీ నియోజకవర్గాలు జనరల్ గాను - జనరల్ నియోజకవర్గాలు ఎస్పీగాను మారే ప్రమాదం ఏర్పడిందని విఫక్ష నేతలు బలంగా ఉన్న నియోజకవర్గాలను ఎస్సీలకు రిజర్వ్ అయ్యేలా కేసీఆర్ పథకాన్ని రచించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయితే, ఈ రాజకీయం కారణంగా ఎస్సీ నియోజకవర్గాలలో ఎదిగి వస్తున్న ఎస్సీ నాయకత్వం కూడా దెబ్బతింటుందని చెప్పారు. మండలాలను, జిల్లాలను ఇష్టానుసారంగా విభజించి కలగాపులగం చేయడం ద్వారా కేసీఆర్ భారత రాష్ట్రపతి పర్యవేక్షణలో అమలు చేసే జోనల్ విధానాన్ని కూడా దెబ్బతీశారని ఆరోపించారు.
నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తియిన తరువాతనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకుందామని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్ కేవలం రాజకీయ దురుద్దేశాలతోనే డిలిమిటేషన్ జరగకముందే జిల్లాలను విభజించారని రేవంత్ ప్రస్తావించారు. ప్రస్తుతం జిల్లాల విభజన పూర్తి అయిన నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజన విషయంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అయితే, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన కేసీఆర్ చర్యలను గమనించాలని కోరారు. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగానే 2004 ఫిబ్రవరి 15 నాటికి ఉన్న 10 జిల్లాల పరిధులను ప్రాతిపదికగా తీసుకొని నియోజకవర్గాల పునర్ విభజన ప్రక్రియను చేపట్టాలని కోరారు. 2014 జూన్ 2 నాటికి ఉనికిలో ఉన్న జిల్లాల ప్రకారంగా డిలిమిటేషన్ ప్రక్రియ జరిగినప్పుడు మాత్రమే అందరికీ సమాన న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఆలా కాకుండా కొత్త జిల్లాలను ప్రమాణికంగా తీసుకొని నియోజకవర్గాల డిలిమిటేషన్ ప్రక్రియను చేపడితే కేసీఆర్ పన్నిన కుట్ర సఫలం అవుతుందని, టీఆర్ఎస్ మినహా మిగిలిన పార్టీలన్నీ నష్టపోయే ప్రమాదం ఏర్పడుతుందని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంగా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి - ప్రధానమంత్రి - కేంద్ర న్యాయశాఖ మంత్రి - కేంద్ర హోం మంత్రి - జాతీయ ఎన్నికల కమిషన్ కు ఆయన విజ్ఞప్తి చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/