కేటీఆర్ బావ‌మ‌రిది గుట్టు విప్పిన ఫైర్ బ్రాండ్‌

Update: 2018-10-27 09:48 GMT
కొత్త పేరు ఒక‌టి తెర మీద‌కు వ‌చ్చింది. నాలుగున్న‌రేళ్ల కేసీఆర్ పాల‌న‌లో ఇప్ప‌టివ‌ర‌కూ కొన్ని వ‌ర్గాల్లో ప్ర‌ముఖంగా వినిపించే కేటీఆర్ బావ‌మ‌రిది పేరు తాజాగా మీడియాలోకి వ‌చ్చేసింది. భారీ ఈవెంట్లను నిర్వ‌హిస్తార‌న్న పేరున్న కేటీఆర్ బావ‌మ‌రిది రాజ్ పాకాల పేరును తెర మీద‌కు తెచ్చారు తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి.

తెలంగాణ‌ను వ్య‌స‌నాల‌కు అడ్డాగా మార్చ‌టంలో కేసీఆర్ స‌క్సెస్ అయ్యారంటూ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తిన రేవంత్ రెడ్డి.. తాజాగా మీడియా ముందుకు వ‌చ్చారు.

ఈ రోజు గ‌చ్చిబౌలి స్టేడియంలో నిర్వ‌హిస్తున్న సెన్సేష‌న్ రైజ్ ఈవెంట్ పై నిప్పులు చెరిగారు. స‌ద‌రు ఈవెంట్ పై ప‌లు విమ‌ర్శ‌లు చేశారు. విచ్చ‌ల‌విడిగా బార్ల‌కు.. ప‌బ్‌ల‌కు అనుమ‌తి ఇచ్చిన కేసీఆర్ స‌ర్కారు తీరును త‌ప్పు ప‌ట్టిన రేవంత్‌.. కేటీఆర్ బావ‌మ‌రిది రాజ్ పాకాల‌కు ప‌లు బార్లు.. ప‌బ్ లు ఉన్న‌ట్లు చెబుతున్నారు.

ఈ రోజు గ‌చ్చిబౌలి స్టేడియంలో నిర్వ‌హిస్తున్న ఈవెంట్ కు అనుమ‌తి ఇవ్వ‌టం దారుణ‌మ‌న్న రేవంత్‌.. ఈ ఈవెంట్లో టికెట్ల ధ‌ర‌లు ల‌క్ష‌ల్లో ఉంటాయ‌ని చెబుతున్నారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ ఈవెంట్లో ఏర్పాటు చేసే ప్ర‌త్యేక టేబుల్ కు ప‌దిమందిని అనుమ‌తిస్తార‌ని.. ఈ టేబుల్ ధ‌ర రూ.8 నుంచి రూ.12 ల‌క్ష‌ల మ‌ధ్య ఉంటుంద‌ని.. వారికి స‌క‌ల సౌక‌ర్యాల్ని అందిస్తార‌ని చెబుతున్నారు.

ఈ టేబుల్‌ను సొంతం చేసుకోవ‌టం అంత ఈజీ కాద‌ని.. ఇందుకోసం పెద్ద ఎత్తున రిక‌మెండేష‌న్లు అవ‌స‌ర‌మంటున్నారు. మ‌రి.. ఈ టేబుళ్ల‌కు ఇంత భారీ మొత్తాన్ని చెల్లించి మ‌రీ సొంతం చేసుకోవ‌టం వెనుక మ‌త‌ల‌బు ఏమిటి? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. గ‌తంలోనూ ఈ త‌ర‌హా ఈవెంట్ల మీద విమ‌ర్శ‌లు వెల్లువెత్తినా.. మీడియాలో రాని ప‌రిస్థితి. తాజాగా ఎన్నిక‌ల పుణ్య‌మా అని ఈ విష‌యం మీడియాలో ప్ర‌ముఖంగా వ‌చ్చేస్తున్న ప‌రిస్థితి.

ఈ ఈవెంట్‌ను మొద‌ట్నించి వ్య‌తిరేకిస్తున్న రేవంత్‌.. ఈ ఈవెంట్‌ను నిర్వ‌హిస్తోన్న‌ది కేటీఆర్ బావ‌మ‌రిది అని చెప్ప‌టం ద్వారా ఈ ఇష్యూకు ప్రాధాన్య‌త వ‌చ్చేసింది. ల‌క్ష‌ల్లో టికెట్ల ధ‌ర‌లు ఉన్నా.. వాటిని నిర్వ‌హించే నిర్వాహ‌కులు మాత్రం జీఎస్టీ చెల్లించ‌కుండా త‌ప్పించుకుంటార‌ని చెబుతున్నారు.

కేటీఆర్ బంధువుల‌కు పోలీసు అధికారులు స‌హ‌క‌రిస్తున్నారంటూ ఆరోప‌ణ‌లు చేసిన రేవంత్‌.. మ‌రోకీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్య‌మంత్రి బంధువులు బ్రోక‌ర్ అవ‌తారాలు ఎత్తిన‌ట్లుగా ఆయ‌న మండిప‌డ్డారు.ప్ర‌తి విష‌యానికి రియాక్ట్ అయ్యే కేటీఆర్‌.. రేవంత్ చేసిన తాజా ఆరోప‌ణ‌ల‌కు ఎలా స్పందిస్తారో చూడాలి.
Tags:    

Similar News