తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్య చేశారు. తాజాగా ఆయన కామారెడ్డి నియోజకవర్గం లోని భిక్కనూరులో జరిగిన భారీ బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన రేవంత్ ఊహించని రీతిలో వ్యాఖ్యలు చేశారు. గడిచిన పదేళ్లలో ఎన్నికల్లో ఓడిపోతున్నా ప్రజలకు సేవ చేసిన నాయకుడు షబ్బీర్ అలీనే అని చెప్పారు.
తాజా మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్దన్ ఆసలు ఎప్పుడైనా కామారెడ్డిలో కనిపించారా? అన్న క్వశ్చన్ వేసిన రేవంత్.. షబ్బీర్ అలీని ముత్యం లాంటి నేతగా అభివర్ణించారు. రేపు కాబోయే ఉప ముఖ్యమంత్రి అని చెప్పిన రేవంత్.. ఒకవేళ రాహుల్ గాంధీ కానీ అనుకుంటే షబ్బీర్ అలీనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందన్నారు.
తెలంగాణలో ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు పెడుతున్నారని.. వాటికి ఎవ్వరూ భయపడటం లేదన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి.. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు.. లాంటి పథకాలు ఒక్కటి కూడా అమలు కాలేదన్న రేవంత్.. కేసీఆర్‌ను రాజకీయంగా బొంద పెట్టటానికే తాను రోడ్ షోలు చేస్తున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ నేతలు డబ్బులిస్తే తీసుకోవాలని.. ఎందుకంటే అవన్నీ మీ డబ్బులే అన్న ఆయన.. ఓటు వేసేటప్పుడు మాత్రం కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు.
ఓపక్క ఢిల్లీ డిసైడ్ చేస్తుందంటూ కేటీఆర్ అదే పనిగా విమర్శలు ఎక్కు పెడుతున్న వేళ.. ఆయన మాటలకు తగ్గట్లే రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఉండటం ఒక ఎత్తు అయితే.. అప్పుడే సీఎం.. డిప్యూటీ సీఎం పదవులు ఎవరికన్న విషయాన్ని రేవంత్ ప్రస్తావించటం తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త కలకలానికి కారణమవుతుందని చెప్పక తప్పదు.