టీడీపీ హయాంలో హైదరాబాద్ కు ఐటీ హబ్బులు తీసుకువస్తే, టీఆర్ఎస్ హయాంలో క్లబ్బులు, పబ్బులు తీసుకువచ్చారని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐటి హబ్బులను తీసుకొనివచ్చి ప్రపంచపఠంలో హైదరాబాద్ కు ఒక సుస్థిరమైన స్థానాన్ని కల్పించడం జరిగిందని చెప్పారు. అయితే మూడేళ్ల టీఆర్ఎస్ పరిపాలనలో డ్రగ్స్ వినియోగానికి వేధికలైన పబ్బులు, క్లబ్బులను తీసుకువచ్చారని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో పబ్బుల సంఖ్య పదికి మించకపోగా ఉండగా తన మూడేళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం 57 పబ్బులకు అనుమతులు ఇచ్చిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ ప్రాంతాలన్నీ క్లబ్బులతో నిండిపోయాయని చెప్పారు. మహరాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు నిషేధించిన ప్రెంచ్ డీజే కార్యక్రమానికి తెలంగాణలో స్వాగతం పలికి హైదరాబాద్ లో ఆ డీజే షోను ఏర్పాటు చేసింది చాలక దానికి టూరిజం శాఖ నుంచి కోట్లాది రూపాయల నిధులను ఎలా కేటాయిస్తారని నిలదీశారు. ప్రభుత్వం ఈ వ్యవహారంలో తక్షణం స్పదించాలని, ఆ కార్యక్రమ నిర్వాహకుల నుంచి ఆ నిధులను తిరిగి రాబట్టాలని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యాపారాన్ని నిరసిస్తూ లిబర్టీ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి నాంపల్లి అబ్కారీ భవన్ దాకా రేవంత్ రెడ్డి పాదయాత్రను నిర్వహించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు అంబేద్కర్ విగ్రహం సమీపానే రేవంత్ బృందాన్ని అడ్డుకొని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగానే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ కేసులో ఉన్న ప్రముఖుల పేర్లను బయటపెట్టవద్దని విచారణాధికారి అకున్ సబర్వాల్ పై ఒత్తిడి తీసుకువస్తున్నది ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాలు నిషేధించిన డీజే షోలను హైదరాబాద్ లో నిర్వహించడంతోపాటు వాటికి టూరిజం శాఖ నిధులను మళ్లించిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. డ్రగ్స్ దందాపై తాము అందించిన సాక్ష్యాధారాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ముఖ్యమంత్రిని నిలదీశారు. డ్రగ్స్ వ్యవహారంలో తన బంధువులు ఉన్నప్పటికి వారిపై కూడ చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్, డ్రగ్స్ వ్యాపారంలో సిఎం బంధువులే ఉన్నారని తాము బయటపెట్టిన సాక్ష్యాలను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు.
సీఎం బంధువు, కేటీఆర్ బావమరిది రాజేంద్రప్రసాద్ పాకాల ఈవెంట్స్ నౌ అనే సంస్థను ఏర్పాటుచేసి దాని ద్వారా ఇతర రాష్ట్రాలలో నిషేధించిన డీజేల షోలను ఏర్పాటు చేయడంతోపాటు మాదకద్రవ్యాలు, మద్యం తాగి ఊగే ఈ కార్యక్రమాలకు 15 సంవత్సరాల స్కూలు పిల్లలను కూడ అనుమతించారనే విషయం తాము సాక్ష్యాదారాలతో ప్రభుత్వం ముందు పెట్టామని రేవంత్ రెడ్డి చెప్పారు. రాజేంద్రప్రసాద్ పాకాల సంస్థ ఆధ్వర్యంలో గత మూడేళ్ల కాలంలో పదికి పైగా అంతర్జాతీయ డీజే షోలను ఏర్పాటు చేశారని, రాష్ట్ర టూరిజం అభివృద్ది శాఖ ఆ కార్యక్రమాలను స్పాన్సర్ చేస్తూ కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని ఆ డ్రగ్స్ ప్రేరేపిత వ్యాపారానికి గుమ్మరించిందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమాలకు టూరిజం శాఖ ద్వారా ఇచ్చిన నిధులన్నింటినీ వెనక్కి రాబట్టాల్సిందేనని రేవంత్ పేర్కొన్నారు. డ్రగ్స్ వ్యాపారంలోను, డ్రగ్స్ వినియోగ వేదికలైన పబ్బుల నిర్వహణలోను భాగస్వామ్యం కలిగిన తన బందువులను కూడ అరెస్ట్ చేయించడం ద్వారా సీఎం కేసీఆర్ తన చిత్తశుద్దిని నిరూపించుకోవాల్సిన సమయం ఇదేనని చెప్పారు.
డ్రగ్స్ వ్యాపారంలో భాగస్వాములైన వారిని ఎవరినైనా వదిలేదిలేదని సీఎం చెబుతుంటే డ్రగ్స్ కేసులో ఇంకా అనేక మంది ప్రముఖులు ఉన్నారని అయితే వారి పేర్లు బయటపెట్టవద్దని తనపై ఒత్తిడిలు వస్తున్నాయని విచారణాధికారి అకున్ సబర్వాల్ చెబుతున్నారని గుర్తుచేశారు. సీఎం పట్టుకోమని చెబుతుంటే వారి పేర్లను కూడ బయటపెట్టవద్దని అధికారులపై ఒత్తిడి తేచ్చే అవకాశం ఎవరికి ఉంటుందని ప్రశ్నించారు. అందుకే విచారణాధికారి అకున్ సబర్వాల్ పై ఒత్తిళ్లు తెస్తున్నది ఎవరో బయటపెట్టాలని రేవంత్ డిమాండ్ చేశారు. డ్రగ్స్ దందాలో భాగస్వామ్యం కలిగిన రాజేంద్రప్రసాద్ పాకాల లాంటి వ్యక్తుల నేరాలకు సంబందించి తాము అందించిన సాక్ష్యాలను విచారాణాధికారులు పరిశీలించాలని రేవంత్ కోరారు.