ఓటుకు నోటు నుంచి తాత్కాలిక ఉపశమనం పొందిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మరో భారీ సమస్య ఎదురుపడిందా? రచ్చ గెలిచిన రేవంత్ కు ఇంటిపోరు మొదలయిందా? తెలంగాణ టీడీపీని లీడ్ చేయాలనుకున్న ఆయన కలకు పార్టీ నాయకులు సహకరించడం లేదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. రేవంత్ రెడ్డి దూకుడుపై పార్టీ సీనియర్ లు అసంతృప్తితో ఉన్నారని, తెలంగాణ టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
కొడంగల్ దాటి వెళ్లొద్దంటూ ఓటుకు నోటు కేసులో షరతు పెట్టిన కోర్టు సడలింపు ఇచ్చిన తర్వాతి మొదటి సభకు ఎల్ బీ నగర్‌ను కేంద్రంగా చేసుకున్న రేవంత్‌రెడ్డి అక్కడ సభ పెట్టడమే కాకుండా కాంగ్రెస్, టీఆర్ ఎస్ లకు చెందిన పలువురిని టీడీపీ గూటికి చేర్చారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. సింహం సింగిల్ గా వస్తుందని హెచ్చరించారు. అయితే సభ జరిగిన తీరుతో... రేవంత్ సొంత పార్టీలోనే సింగిల్ అయిపోయారా అనే చర్చకు కూడా మొదలయింది.
ఎల్ బీనగర్ సభలో రేవంత్ రెడ్డి కామెంట్లను పక్కనపెట్టి సభ జరిగిన తీరును గమనించాలని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఓటు కు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఆరెస్టైన వెంటనే తెలంగాణ టీడీపీ నేతలంతా ఆయన ఇంటికి వెళ్లారు. మేము అండగా ఉన్నామంటూ హామీ కూడా ఇచ్చారు. టీటీడీపీ నేతలంతా రేవంత్ ఫ్యామిలీని ఓదార్చారు. అయితే.... రేవంత్ కు ఉపశమనం దొరికి ఆయన మొదటిసారి నగరానికి వచ్చి....అదికూడా చేరికలతో పార్టీకి బలం ఇస్తే... టీడీపీ నేతలెవరు సభకు హాజరు కాలేదు. రేవంత్ సింగిల్ గానే సభను నడిపించారు. ఆ రోజుకు... ఈ రోజుకు ఎంతో తేడా. అప్పుడు తామంతా రేవంత్ కు అండగా ఉంటామని చెప్పారు. కానీ ఇప్పుడు సిటీ లోనే సభ పెట్టినా ఒక్కరు రాలేదు. రేవంత్ దూకుడుపై సీనియర్లు అసంతృప్తితో ఉండటం వల్లే ఆయన్ను దూరం పెట్టారనే ప్రచారం జరుగుతోంది.
ఎల్ బీ నగర్ లో రేవంత్ సభకు టీటీడీపీ నేతలంతా మూకుమ్మడిగా డుమ్మాకొట్టడం ఆసక్తికరంగా మారింది. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లినప్పుడు ఉన్న ఐక్యత నేతల్లో ఇప్పుడు కనిపించడం లేదని వివరిస్తున్నారు. ఈ సభతో తెలంగాణ టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు రేవంత్ ఎల్ బీ నగర్ సభతో బయటపడ్డాయని అంటున్నారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే 2019లో తెలంగాణలో టీడీపీ అధికారంలోకి రావాలనుకునే ఆశ అడియాశే అవుతుందని పార్టీ శ్రేణులు టెన్షన్ పడుతున్నాయి.