రేవంత్ పాదయాత్ర టార్గెట్ పీసీసీ పీఠమేనా?

Update: 2021-02-09 06:30 GMT
ఎలాగైనా సరే.. కాంగ్రెస్ పీసీసీ పీఠం అధిరోహించాలి.. కేంద్రంలోని కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి పెంచాలి.. తెలంగాణ సీఎం పీఠాన్ని వచ్చేసారి చేజిక్కించుకోవాలి.. ఈ క్రమంలోనే బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీశారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి. తాజాగా అచ్చంపేట నుంచి హైదరాబాద్ కు ఆయన సడెన్ గా ప్రారంభించిన పాదయాత్ర వెనుక అసలు కథ అదేనంటున్నారు.

నిజానికి అచ్చంపేటలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా రేవంత్ రెడ్డి సభకు వచ్చి ప్రసంగించారు. అక్కడే ఉన్న రేవంత్ సన్నిహిత నేతలు మల్లు రవి, సీతక్కలు రైతుల సమస్యలపై పాదయాత్ర చేయాలని రేవంత్ రెడ్డికి సూచించగానే.. మరో ఆలోచన లేకుండా రేవంత్ నడక ప్రారంభించారు. ఇంత సడెన్ గా.. ఎలాంటి ఏర్పాట్లు... తిండి తిప్పలు లేకుండా పాదయాత్ర చేయడంపై అందరిని షాక్ కు గురిచేస్తోంది. ఇదేమైనా ముందస్తు ప్లాన్ నా? అని కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో ‘పాదయాత్ర’ అంటే పవర్ ఫుల్ యాత్ర. ఆ యాత్ర చేసిన వారంతా సీఎంలు అయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎన్ చంద్రబాబు నాయుడు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగుజాడలను రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నాడు. రేవంత్ రెడ్డి రోడ్డు పక్కన నిర్మించిన గుడారంలో నిద్రిస్తూ ఆ ఫొటోలను మీడియాకు విడుదల చేసి, తద్వారా భారీ ప్రచారం పొందుతున్నారు.

రేవంత్  పాదయాత్రకు అద్భుతమైన స్పందన వస్తోంది. రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దీనిని కొనసాగించాలని డిసైడ్ అయ్యాడట.. పీసీసీ చీఫ్ వస్తే రాష్ట్రమంతా చేయడానికి రెడీ అయ్యాడట.. మరి సీఎం కావాలనుకుంటున్న రేవంత్ వ్యూహం పని చేస్తుందో లేదో వేచి చూద్దాం.. ముందుగా హైకమాండ్ ఈయనను పీసీసీ చీఫ్ చేస్తుందో లేదా అనేదే ఇప్పుడు అసలు సమస్యగా మారింది. ఒత్తిడి పెంచడానికే రేవంత్ ప్రజల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది..
Tags:    

Similar News