తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సందర్భానుసారంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటారు. ఓటుకు నోటు కేసు ఉదంతం తర్వాత ....రేవంత్ విమర్శలకు పదునెక్కువైంది. తాజాగా - ఆయన కాంగ్రెస్ నేతగా మారిన తర్వాత....ఆ తీవ్రత మరింత పెరిగింది. కొద్ది రోజుల క్రితం మెట్‌పల్లిలో జరిగిన రైతు గర్జన లో కేసీఆర్ ను క.చ.ర చంద్రశేఖర్ రావు అంటూ రేవంత్ సంబోధించి సంచలనం రేపారు. తాజాగా, రేవంత్ రెడ్డి......మరోసారి సీఎం కేసీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్....సచివాలయానికి రాకుండా....ఇంటి నుంచే నిద్రవాస్థలో పాలన చేస్తున్నారని.....ఆయనకు 'కుంభకర్ణుడు` అని బిరుదివ్వచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను ఎద్దేవా చేస్తూ రేవంత్ చేసిన ఓ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
టీటీడీపీ నుంచి బయటకు వచ్చినపుడే తాను సీఎం కేసీఆర్ పైన మాత్రమే పోరాడతానని చెప్పి సంచలనం రేపారు. సందు దొరికితే సీఎంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. తాజాగా, కేసీఆర్ ను ఎద్దేవా చేస్తూ రేవంత్ ఓ ట్వీట్ చేశారు. సచివాలయానికి రాకుండా ఇంటినుంచే పాలన కొనసాగిస్తున్న కేసీఆర్ పై సెటైరికల్ గా ఓ ట్వీట్ చేశారు.
'సచివాలయంలోకి అడుగుపెట్టకుండా, ఇంటి నుంచి నిద్రావస్థలో పని చేస్తూ ఏడాది కాలం పూర్తి చేసుకున్న మన ముఖ్యమంత్రికి 'కుంభకర్ణ అవార్డు' ఇవ్వాలి.. నిద్రావస్థలో ఉన్న సీఎం @ తెలంగాణ సీఎంఓ' అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. రేవంత్ ట్వీట్ పై కేసీఆర్ రియాక్షన్ ఏవిధంగా ఉంటుందో అన్న సంగతి ఆసక్తికరంగా మారింది.