మహబూబ్ నగర్ జిల్లా కోస్గి మండటంలో మంత్రి జూపల్లి కృష్ణారావు సభలో కలకలం రేగింది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి కారణంగా ఈ హడావుడి చోటు చేసుకుందని చెబుతున్నారు. శిలాఫలకానికి గులాబీ పరదా వేయటాన్ని రేవంత్ ప్రశ్నించటం.. మరో సభలో మంత్రి మాట్లాడుతుండగా మంత్రి మైకును రేవంత్ లాక్కునే ప్రయత్నం చేయటం కలకలం రేగటంతో పాటు.. ఉద్రిక్త పరిస్థితులకు కారణంగా మారింది.
కోస్గి మండటంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి వీలుగా మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన జరిగింది. ఇందులో భాగంగా అమ్లికుంట్లలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అయితే.. శిలాఫలకానికి గులాబీ పరదా ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి.. అక్కడి అధికారుల్ని నిలదీస్తూ.. గులాబీ పరదా ఏమిటి? ఇది పార్టీ కార్యక్రమమా?.. ప్రభుత్వ కార్యక్రమమా? అంటూ ప్రశ్నించారు. దీంతో.. మంత్రి జూపల్లి జోక్యం చేసుకుంటూ ఏ రంగుఅయితే ఏముందిలే అంటూ రేవంత్ ను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
అనంతరం బోగారంలో బీటీ రోడ్డును ప్రారంభించిన సందర్బంగా మంత్రి జూపల్లి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి విమర్శలు చేస్తూ.. పక్కనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణకు నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారని.. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల్ని ఎవరూ అడ్డుకోలేరంటూ చెబుతుండగా.. రేవంత్ ఆగ్రహంతో మంత్రి జూపల్లి నుంచి మైకు లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో.. ఒక్కసారి గొడవ మొదలైంది. మైకును లాక్కునే ప్రయత్నంలో రేవంత్ వాదన ఏమిటంటే.. ప్రజా కార్యక్రమంలో రాజకీయ మాటలు ఏమిటి? అంటూ ప్రశ్నించగా.. చంద్రబాబు ఇచ్చే మూటల కోసం పని చేస్తున్నావంటూ మంత్రి వ్యాఖ్యానించటంతో రచ్చ పెద్దదైంది.
ఈ సందర్భంగా రేవంత్ రియాక్ట్ అయి జగన్ తో కుమ్మక్కై ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపణలు చేశారు. నేతల మధ్య లొల్లి ఇలా సాగుతుండగా.. వీరిని చూసి కార్యకర్తలు సైతం పోటాపోటీగా నినాదాలు చేయటంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో.. పోలీసులు జోక్యంచేసుకొని లాఠీఛార్జ్ చేసే వరకూ వెళ్లింది. ఈ గొడవ నేపథ్యంలో మంత్రి కార్యక్రమం మధ్యలో నుంచి వెళ్లిపోయారు.ఈ ఉదంతాన్ని చూస్తే.. అధికార.. విపక్ష సభ్యులు ఇద్దరూ దొందూ దొందూ అన్నట్లుగా ఉండటం కనిపించక మానదు.