తెలుగు రాష్ర్టాల అసెంబ్లీ సమవేశాలు వేర్వేరుగా వేర్వురు చోట్ల జరుగుతున్నప్పటికీ కొన్ని కామన్ పాయింట్లు కనిపిస్తున్నాయి. అవేంటంటే అధికార పక్షం తను చెప్పిందే వేదం అనే రీతిలో వ్యవహరించడం, తమకు నచ్చని వారిపై సస్పెన్షన్ వేటు, కొందరు ఫైర్ బ్రాండ్ నాయకులనైతే అసెంబ్లీ పరిసరాల్లోకి అడుగుపెట్టకుండా చూడటం ఇలాంటివి కొన్ని. ఏపీలో వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు ఇలాంటి పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. అసెంబ్లీ పరిధిలోకి ఆమెను అనుమతించకపోవడంతో రోజా నిరసన తెలిపారు. ఇప్పుడు సరిగా అలాంటి అనుభవమే తెలంగాణ టీడీఎల్పీ నేత ఎ.రేవంత్‌రెడ్డికి ఎదురైంది.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ మధుసూదనాచారిని, ప్రతిపక్ష నేత జానారెడ్డిని కలిసేందుకు వెళ్తున్న అసెంబ్లీ లోపలికి రేవంత్ రెడ్డి వెళ్తుండగా మార్షల్స్ అడ్డుకున్నారు. దీనిపై దాదాపు అరగంటపాటు హైడ్రామా నడిచింది. అనంతరం చర్చల ద్వారా ఉత్కంఠకు తెరపడింది. టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ విషయమై స్పీకర్ తో మాట్లాడేందుకు అసెంబ్లీ భవనం లోపలికి వెళ్లేందుకు వస్తుండగా రేవంత్ ను మార్షల్స్ అడ్డుకున్నారు. దీనిపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ 'నన్ను లోపలికి వెళ్లనివ్వకపోవడానికి మీరు ఎవరు ? కారణాలు ఏంటి' అని ప్రశ్నించారు. ఇందుకు మార్షల్స్ 'మిమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేశారని, ఆమేరకు మాకు ఆదేశాలు ఉన్నాయని, లోపలికి మీకు అనుమతి లేదు' అని అన్నారు. దీనిపై రేవంత్ రెడ్డి ద్వారం దగ్గర నిరసన తెలుపుతుండగా, ఇంతలో అక్కడకు ఎమ్మెల్యే జి కిషన్ రెడ్డి వచ్చారు. విషయం తెలుసుకుని మార్షల్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఎమ్మెల్యేను లోపలికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు..రేవంత్ ను సభ నుంచి మాత్రమే సస్పెండ్ చేశారు..లాబీల్లో తిరగడానికి, స్పీకర్ ను, మంత్రులను కలవడానికి అవకాశం ఉంది మీ చీఫ్ మార్షల్ ను పిలవండి' అంటూ మార్షల్స్ ను గద్దించారు. ఈలోపు చీఫ్ మార్షల్ కరుణాకర్ అక్కడకు చేరుకున్నారు. 'మిమ్మల్నీ సభ నుంచి సస్పెండ్ చేశారు, లోపలికి అనుమతి లేదు, మాకు మౌఖిక ఆదేశాలు ఉన్నాయి' అని ఆయన చెప్పారు. దీనికి రేవంత్ ఆగ్రహాంతో 'మీకు ఉత్తర్వులు ఏమైనా ఉన్నాయా..సభా వ్యవహారాలకు మాత్రమే సస్పెన్షన్ వర్తిస్తుందని, లాబీలు, ఇతర ప్రాంగణానికి కాదన్నారు. రాతపూర్వకమైన ఆదేశాలు చూపించాలి' అని అన్నారు. దీనికి కిషన్ రెడ్డి మద్దతు ఇచ్చారు. అయితే మాకు మౌఖిక ఆదేశాలు మాత్రమే ఉన్నాయని, రాతపూర్వక ఆదేశాలు లేవని చెప్పారు.
ఈ క్రమంలోనే రేవంత్ గట్టిగా మాట్లాడుతూ భవనం లోపలకు వెళ్లారు. ఇలా మమ్మల్ని తోసుకుంటూ రావడం మంచి పద్ధతి కాదని చీఫ్ మార్షల్ కరుణాకర్ రేవంత్ తో చెప్పడంతో, దానికి రేవంత్ ' మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు.. అసెంబ్లీ కార్యదర్శిని పిలవండి..ఆయన లేకపోతే ఉప కార్యదర్శి పిలవాలి' అని డిమాండ్ చేశారు. ఇప్పుడు సభ జరుగుతోందని, అది అవగానే పిలుస్తానని చెప్పారు. నేను స్పీకర్ ను - జానారెడ్డిని కలవడానికి వెళుతున్నానని, సభలోపలికి కాదన్నారు. వాళ్లంతా సభలోనే ఉన్నారని చీఫ్ మార్షల్ వివరించారు. వాళ్లకు సమాచారం ఇవ్వాలని, ఎప్పుడు వస్తారో కనుక్కుని రావాలన్నారు. నేను 10 నిమిషాల్లో విషయం చెప్పి వస్తానని వివరించారు. అనంతరం రేవంత్ టీడీఎల్పీకి వెళ్లిపోయారు. మరో పావుగంటలో కరుణాకర్ స్పీకర్ కు సమాచారం ఇవ్వగా, సభ అవగానే తానే పిలుస్తానని ఆయన చెప్పడంతో అదే విషయాన్ని రేవంత్ కు తెలియజేశారు. దీంతో ఉద్రిక్తత సడలినట్టయింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/