రేవంత్‌ రెడ్డి టీఆర్‌ ఎస్‌ పార్టీలోకి వెళ్లబోతున్నాడా..?

Update: 2019-01-18 06:35 GMT
కేసీఆర్‌ పై గెలవాలనే లక్ష్యంలో 10 సంవత్సరాల నుంచి గజిని మెహమ్మద్‌ లా పోరాటం చేశారు వంటేరు ప్రతాపరెడ్డి. చివరకు తనవల్ల కాదని చేతులెత్తేసిన వంటేరు.. ఇప్పుడు సైలెంట్‌ గా కారెక్కారు. మరోవైపు.. తమకు వ్యతిరేకంగా బలమైన లీడర్ తెలంగాణలో ఉండూకూదనే భావనతో ఉన్న టీఆర్‌ ఎస్‌ పార్టీ కళ్లు.. ఇప్పుడు ఫైర్‌ బ్రాండ్‌ రేవంత్‌ రెడ్డిపై పడ్డాయి.

రేవంత్‌ రెడ్డి చాలా గట్టి కేండిడేట్‌. ప్రస్తుతం కాంగ్రెస్‌ లో ఉన్న సీనియర్‌ లీడర్లకంటే స్ట్రాంగ్‌ పర్సనాలిటీ. ఇప్పుడు కాకపోయినా.. భవిష్యత్తులో ఎప్పటికైనా టీఆర్‌ ఎస్‌ పార్టీకి మేకులా మారే వ్యక్తి రేవంత్‌. అలాంటి రేవంత్‌ ని ఇప్పుడు పార్టీలో పార్టీలో చేర్చుకుని లూప్‌లైన్‌ పెట్టాలని ప్రయత్నాలు ప్రారంభించిందట టీఆర్‌ ఎస్‌. అందులో బాగంగా.. ఎమ్మెల్సీ ఇచ్చి సైలెంట్‌ గా సైడ్ చేయాలని చూస్తోందట. అయితే… భవిష్యత్తులో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి అబ్యర్థిగా ఉన్న రేవంత్‌… కేవలం ఎమ్మెల్సీ పదవికి ఆశపడి టీఆర్‌ ఎస్‌ లోకి వెళ్లే అవకాశమే లేదు. కానీ ఎలాగైనా సరే.. రేవంత్‌ ని తమ పార్టీలో చేర్చుకోవాల్సిందేనని గట్టి పట్టుదలతో ఉంది టీఆర్‌ ఎస్‌.


Full View

Tags:    

Similar News