రేవంత్‌రెడ్డి వ‌ర్కింగ్ స్టైల్ మామూలుగా లేదుగా...!

Update: 2021-12-04 15:30 GMT
రేవంత్‌రెడ్డి పీపీసీ అధ్య‌క్షుడు అయ్యాక మామూలు దూకుడుగా లేడు. తెలంగాణ కాంగ్రెస్‌కు ఒక్క‌సారిగా ఊపు తేవ‌డంలో రేవంత్ మానియా మామూలుగా ప‌నిచేయ‌లేదు. అస‌లు రేవంత్ రెడ్డి టీ పీసీసీ ప‌గ్గాలు చేప‌ట్ట‌క ముందు వ‌ర‌కు తెలంగాణ‌లో ఓ 70 - 80 సీట్ల‌లో పోటీ చేసేందుకు నాయ‌కులు లేరు. అస‌లు పోటీ చేస్తామ‌ని కూడా ఎవ్వ‌రూ ముందుకు రాలేదు. అలాంటిది ఇప్పుడు మిర్యాల‌గూడ‌, కొల్ల‌పూర్‌, వికారాబాద్‌, తాండూరు లాంటి చోట్ల కూడా ఒక్కో సీటుకు ముగ్గురు, న‌లుగురు నేత‌లు పోటీ ప‌డుతోన్న ప‌రిస్థితి ఉంది. రేవంత్ ఒక్క‌సారిగా రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తూ పార్టీ సీనియ‌ర్ల‌తో పాటు అసంతృప్త నేత‌ల‌ను క‌లుస్తూ చ‌క‌చ‌కా ముందుకు దూసుకు పోతున్నారు.

అయితే మ‌ధ్య‌లో హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల టైంలో రేవంత్ కాస్త స్లో అయిన‌ట్టు మాత్ర‌మే క‌నిపించారు. అయితే అక్క‌డ రాజ‌కీయ వ్యూహం అయితే వేరే ఉంది. ఆ త‌ర్వాత టీ కాంగ్రెస్ నేత‌లు కొంద‌రు హైక‌మాండ్‌కు ఫిర్యాదు చేయ‌డంతో.. హై క‌మాండ్ నుంచి కూడా రేవంత్‌కు వార్నింగ్ రావ‌డంతో రేవంత్ సీనియ‌ర్ల‌ను కూడా క‌లుపుకుని వెళుతున్నారు. ఇటీవ‌ల వ‌రి మీద జ‌రిగిన ధ‌ర్నా కార్య‌క్ర‌మానికి కోమ‌టిరెడ్డితో స‌హా సీనియ‌ర్ నేత‌లు అంద‌రూ వ‌చ్చారు. ఇప్పుడు టీ కాంగ్రెస్ కేడ‌ర్ కూడా మంచి ఊపు మీదే ఉంది.

అయితే కేసీఆర్ ఎవ్వ‌రి అంచ‌నాల‌కు అంద‌రు. త‌మ‌కు కాంగ్రెస్ ప్ర‌త్య‌ర్థి కాదు.. బీజేపీయే అని టీఆర్ఎస్ వాళ్లు చెపుతున్నారు. ఇక్క‌డ వేరే లెక్క‌లు ఉన్నాయి. రేవంత్ దూకుడు కూడా కేసీఆర్‌ను క‌ల‌వ‌ర పెడుతోంది. కేసీఆర్ త‌మ‌కు బీజేపీయే ప్ర‌త్య‌ర్థి అని ఎంత చెప్పినా ఆ పార్టీకి స్థానికంగా కేడ‌ర్ లేదు. మ‌రోవైపు తెలంగాణ‌లో ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువ‌. బీజేపీకి నాయ‌కుల కొర‌త తీవ్రంగా ఉంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఇప్పుడు తెలంగాణ‌లో ఆప్ష‌న్ కోసం ఎదురు చూస్తోన్న నాయ‌కులు, కేడ‌ర్ కూడా కాంగ్రెస్ వైపే చూస్తోంది.

రేవంత్ ఇదే అద‌నుగా పాత కాంగ్రెస్ నాయ‌కులు, పాత టీడీపీ నాయ‌కుల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుని.. పార్టీని బోల‌పేతం చేసేందుకు బాగా వ‌ర్క‌వుట్ చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే కేసీఆర్‌, టీఆర్ఎస్‌ను గ‌ట్టిగా విమ‌ర్శించే నేత‌ల‌ను ఎంపిక చేసుకుని వీరినే మీడియా డిబేట్ల‌కు పంపేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. రేవంత్ ఇదే ఊపు కంటిన్యూ చేస్తే ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీ స్ట్రాంగ్ లీడ‌ర్స్‌తో పాటు టీఆర్ఎస్ అసంతృప్త నేత‌లు కూడా కాంగ్రెస్ వైపు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. ఇక తెలంగాణ‌లో న్యూట్ర‌ల్ ఓట‌ర్స్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తోన్న ప‌రిస్థితి అయితే ఉంది. మ‌రి దీనిని రేవంత్ ఎలా క్యాష్ చేసుకుంటారో ? చూడాలి.
Tags:    

Similar News