ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో నేతల పరిస్థితిని, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని.. పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు వరుస పెట్టి రివ్యూలపై రివ్యూలు చేస్తున్నారు. అప్పటికి 150కి పైగా నియోజకవర్గాల్లో పరిస్థితిని చంద్రబాబు తెలుసుకున్నారు. రివ్యూలు చేశారు. నాయకులను హెచ్చరించారు. మార్పులు తప్పవని కూడా తేల్చి చెప్పారు. అంతేకాదు.. కొందరికి టికెట్‌పై హామీ కూడా ఇచ్చారు. అయితే.. ఇంత చేస్తున్నా.. మార్పు కనిపించకపోవడం ఇప్పుడు ప్రధాన ప్రశ్న.
తాజాగా మంగళవారం నుంచి చంద్రబాబు.. మరిన్ని నియోజకవర్గాల వారీగా సమీక్షలను తిరిగి ప్రారంభించనున్నారు. రోజుకు 6 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ఇన్‌ఛార్జుల పనితీరుపై సమీక్షించనున్నారు. రాజోలు, భీమవరం, గంగాధర నెల్లూరు, కడప, సూళ్లూరుపేట, నంద్యాల నియోజకవర్గాల్లో పనితీరుపై సమీక్ష నిర్వహించనున్నారు.
తాజాగా సమీక్షించనున్న నియోజకవర్గాల్లో రాజోలులో పరిస్థితి ఏమీ బాగోలేదు. ఎందుకంటే.. గత ఎన్నిక లకు ముందు టీడీపీలో ఉన్న రాపాక వరప్రసాద్.. జనసేనలోకి వెళ్లారు. అటు నుంచి వైసీపీలోకి వచ్చారు. తర్వాత.. ఇక్కడ పార్టీ పలచన అయింది. ఇక, భీమవరంలో నేతలు ఉన్నా.. పార్టీ దూకుడుగా అయితే.. ముందుకు సాగడం లేదు. పైగా వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంటే.. ఈ సీటు సహా రాజోలును ఆపార్టీకి వదులుకోవడం ఖాయం. ఈ విషయం తెలిసి.. తమ్ముళ్లు అసలు పట్టించుకోవడం లేదు.
ఇక, కడపలో పరిస్థితి అందరికీ తెలిసిందే. నంద్యాల మాత్రంటీడీపీకి పట్టుకొమ్మగా ఉంది. ఇక్కడ పార్టీ నాయకులు చాలా మంది ఉన్నారు. అయితే.. టికెట్ ఎవరికి ఇస్తారనేది మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. మరోవైపు.. గంగాధర నెల్లూరులో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. ఒకప్పుడు.. కుతూహలమ్మ కాంగ్రెస్‌లో ఉండగా.. ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. ఆమె కుమారుడు ఈ టికెట్ ఆశిస్తున్నారు. అయితే.. చంద్రబాబుక్లారిటీ ఇవ్వడం లేదు. ఇతమిత్థంగా.. ఎన్ని సమీక్షలు చేసినా నాయకుల్లో జోరు పెంచాలంటే.. ఖచ్చితంగా సరైన నిర్ణయాలు తీసుకోవాలని అంటున్నారు పరిశీలకులు. లేకుండా చాయ్ బిస్కట్ భేటీల్లాగానే మారుతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.