అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల అమెరిక్లనలో వ్యతిరేకత రోజురోజుకి పెరిగిపోతోంది. వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్‌నకు పాలనాపరమైన నైపుణ్యాలు లేవని అక్కడి పౌరులు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా, ట్రంప్ పై అభిశంసన తీర్మానం పెట్టాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. కాలిఫోర్నియాలోని రిచ్ మండ్ సిటీ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. అమెరికా రాజ్యాంగంలోని ఫారెన్ ఎమాల్యూమెంట్స్ (విదేశీ జీతభత్యాలు) , డొమెస్టిక్ ఎమాల్యూమెంట్స్ ( స్వదేశీ జీతభత్యాలు ) క్లాస్ లను ట్రంప్ తుంగలో తొక్కారని ఆ కౌన్సిల్ సభ్యురాలు గెయిల్ మెక్ లాఫ్ లిన్ తెలిపారు. వాణిజ్య లావాదేవీలున్న దేశాలతో ట్రంప్ పక్షపాత వైఖరి కనబరుస్తున్నారని చెప్పారు. యూఎస్ కాంగ్రెస్ సభ్యులు తక్షణమే ట్రంప్ పై అభిశంసన తీర్మానం పెట్టాలని కోరారు. రాజ్యాంగంలోని ఎమాల్యూ మెంట్స్ క్లాస్ నిబంధనల ప్రకారం...యూఎస్ కాంగ్రెస్ అనుమతి లేకుండా విదేశీ ద్రవ్యాన్ని - బహుమతులను దేశాధ్యక్షుడు స్వీకరించడానికి వీల్లేదని రిచ్‌మండ్ సిటీ కౌన్సిల్ సభ్యుడు జేల్ మిరిక్ తెలిపారు. ట్రంప్ పదేపదే ఎమాల్యూమెంట్స్ క్లాస్ ను ఉల్లంఘిస్తున్నారని చెప్పారు.
మరోవైపు నెల రోజుల పాలనలో పలు వివాదాస్పద నిర్ణయాలతో వార్తలకెక్కుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా అణ్వాయుధ పోటీకి తెరతీశారు. అమెరికాను అణ్వాయుధ సంపత్తిలో అగ్ర స్థానంలో నిలబెట్టాలన్నదే తన ఆకాంక్ష అని ఉద్ఘాటించారు. అందుకే అణ్వాయుధ తయారీకి బడ్జెట్ లో అగ్ర తాంబూలం దక్కాలన్నది తన అభిమతమని రాయిటర్స్ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తెలిపారు.. అణ్వాయుధ పోటీలో అమెరికా ప్రస్తుతం వెనుకబడి వుందని, ఈ రంగంలో అగ్రస్థానానికి చేరేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. తమ దేశ జాతీయ భద్రతకు ఉత్తరకొరియా నుండి పొంచి వున్న ముప్పును చైనా మాత్రమే 'అతి సులభం'గా పరిష్కరించగలదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచం అణ్వాయుధ ముప్పును గుర్తించేంత వరకూ అమెరికా తన అణ్వాయుధ సంపత్తిని పెంచుకోవాల్సిన అవసరం వుందని గత డిసెంబర్ లో తానుచేసిన ట్వీట్ ను ఆయన పునరుద్ఘాటించారు.
ఐరోపా కూటమిని పాలనా వ్యవస్థగా తాను గట్టిగా సమర్థిస్తానని ట్రంప్ తెలిపారు. ఐరోపా కూటమికి తాను పూర్తిగా అనుకూలమని, ఇజ్రాయిల్-పాలస్తీనా వివాదానికి రెండు దేశాల ఏర్పాటే పరిష్కారమన్న విషయాన్ని అధ్యక్షహోదాలో తొలిసారిగా ప్రకటించానని ఆయన గుర్తు చేశారు. అయితే ఇరుదేశాలూ సంతోషంగా వుంటే తాను కూడా సంతృప్తి చెందుతానన్నారు. నాటో కూటమి సభ్యదేశాలు తమ రక్షణ వ్యయాన్ని మరింత పెంచి తమ వాటాను చెల్లిస్తే అమెరికాపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు.. ఇప్పటికే వారు అమెరికాకు భారీమొత్తంలో సొమ్ము బకాయి పడ్డారన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/