లేటెస్టు ఫీచర్ల స్మార్టు ఫోన్ ను రూ.251కే ఇస్తామంటూ రింగింగ్ బెల్సు అనే సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరిలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ తరువాత అవమానాలు - అనుమానాలు - ఆరోపణలు ఎదుర్కొన్న రింగింగ్ బెల్స్ ఎట్టకేలకు ఆ 251 రూపాయల ఫోన్లను కస్టమర్లకు అందించడానకి అన్ని ఏర్పాట్లు చేసింది. ఫ్రీడమ్251 పేరుతో అందజేస్తున్న ఈ పోన్లను మొత్తం 2 లక్షలు సిద్ధం చేసిందట. ఈ సందర్భంగా రింగింగ్ బెల్స్ మరో సంచలనానికి తెరలేపుతోంది. 32 అంగుళాల ఎల్ ఈడీ టీవీలను రూ.10 వేల కంటే తక్కువ ధరకే అందిస్తామని అనౌన్సు చేసింది. ఇండియాలో తమ టీవీలో అత్యంత చౌకయినవని రింగింగ్ బెల్సు సీఈవో మోహిత్ గోయల్ ప్రకటించారు.
కాగా 251 రూపాయలకు ఫోన్లు ఇస్తామని ప్రకటించిన తరువాత అనేక పరిణామాలు జరిగాయి. వాటన్నిటినీ అధిగమించి 2 లక్షల ఫోన్లను రెడీ చేసింది రింగింగ్ బెల్సు. దీంతో అప్పటి అనుభవాల నేపథ్యంలో ఈసారి పెద్ద గ్యాప్ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే లక్ష టీవీలు రెడీ చేశామని మరో రెండు రోజుల్లో కొనుగోళ్లకు అందుబాటులోకి తెస్తామని మోహిత్ ప్రకటించారు.
ఫ్రీడమ్ 251 ఫోన్లు ఒక్కొక్క దానిపై తనకు రూ.140 నుంచి రూ.150 లాస్ వస్తోందని... అయినా గ్రామీణ భారతదేశానికి డిజిటల్ ఫలాలు అందించడానికి తన వంతు కర్తవ్యం నిర్వహించినందుకు ఆనందంగా ఉందని మోహిత్ అంటున్నారు. తమ ఫ్రీడమ్ ఫోన్లతో మోడీ కలలు కంటున్న డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియాల రెండింటి ఫలాలు సాకారమైనట్లయిందని చెబుతున్నారు.