ఆయన ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చుంటారు. ఆయనకేమీ ప్రమేయం లేనట్లుగానే, ఆయన ఏమాత్రం జోక్యం చేసుకోనట్లుగానే.. ఆయన భార్యగారి ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుంది. ఆ సమావేశం.. మొత్తం అధికారాన్ని ఆయన చేతిలో పెట్టేస్తూ నిర్ణయం తీసుకుంటుంది. ఈ పొలిటికల్ ఫ్యామిలీ డ్రామా.. బీహార్ రాజకీయాల్లో కొత్త కాదు. బీహార్ లో ఆర్జేడీ తరఫున అభ్యర్థులను ఎంపిక చేసే పూర్తి అధికారాన్ని పార్టీ నాయకులంతా కలిసి లాలూప్రసాద్ యాదవ్ చేతిలో పెట్టారు.
అభ్యర్థుల ఎంపిక గురించి ఏర్పాటుచేసిన పార్టీ సమావేశం లాలూ భార్య - మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి అధ్యక్షతన జరిగింది. నిజానికి ఈ సమావేశంలో వారు నిర్ణయించింది.. ఎంపిక బాధ్యతను లాలూ చేతిలో పెట్టాలని మాత్రమే. బీహార్ రాజకీయాలు, ప్రత్యేకించి తన సొంత పార్టీ ఆర్జేడీ రాజకీయాలకు సంబంధించి ఎలాంటి పదవులు ఉన్నా లేకపోయినా.. లాలూప్రసాద్ యాదవ్ మోనార్క్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూటమి పార్టీల్లో కూడా ఆయనే చక్రం తిప్పుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా తన దయ కోసం నిరీక్షించే పరిస్థితిని సృష్టించగలుగుతున్నారు. అలాంటి నేతకు అభ్యర్థుల ఎంపిక అధికారం లేకుండా ఎలా ఉంటుది. కాకపోతే.. ఏదో ప్రజాస్వామికంగా పార్టీ వ్యవహారం జరగుతున్నట్లుగా ఒక బిల్డప్ కోసం.. సమావేశం పెట్టి.. ఆ నిర్ణయం తీసుకున్నట్లుగా చేశారన్నమాట.
అయితే ఇక్కడ ట్విస్టు ఏంటంటే.. మహాకూటమి గెలిస్తే.. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి అవుతారని ముందే ప్రకటించారు. అయితే నితీశ్ పార్టీ జేడీయూ కంటె, ఎన్నికల్లో లాలూ పార్టీ ఆర్జేడీ కి ఎక్కువ సీట్లు వస్తే ఏంటి పరిస్థితి? సాధారణంగా ఎక్కువ సీట్లు వచ్చిన వారే అధికారంలోకి సీఎంగా రావాలని అనుకుంటారు కదా.. అనే సందేహం ఎవరికైనా వస్తుంది? ఇదే ప్రశ్న విలేకరులు రబ్రీదేవిని అడిగారు. జేడీయూ కంటె ఆర్జేడీ కి ఎక్కువ సీట్లు వస్తే మీరు సీఎం అవుతారా అంటే.. మహాకూటమి తరఫున ఇప్పటికే నితీశ్ సీఎం అని ప్రకటించేశాం కదా అని ఆమె లౌక్యంగా జవాబిచ్చారు. కానీ అలాంటి పరిస్థితే వస్తే గనుక.. రాజకీయాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో ఎవరికెరుక?