కరోనాతో గజగజ వణికిపోతున్న గుంటూరు !

Update: 2020-04-15 06:50 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి.  తాజాగా 19 మందికి కరోనా పాజిటివ్ రాగా... రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 502కు పెరిగాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో క‌రోనా పాజిటివ్ కేసులు క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. గుంటూరు జిల్లాలో నేడు మరో  4 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో గుంటూరు జిల్లాలో ఒక్కసారిగా కరోనా కేసులు 118కు చేరుకున్నాయి. ఆ తరువాత స్థానంలో 96 కేసులతో కర్నూల్ జిల్లా ఉంది.

ఇకపోతే ,తాజాగా గుంటూరు జిల్లా తాజాగా దాచేపల్లి మండలంలో ఓ ఆర్ ఎంపీ డాక్ట‌ర్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో జిల్లా వైద్య‌, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్త‌మ‌య్యారు. ఆ ఆర్ ఎంపీ ద‌గ్గ‌ర ఎవ‌రెవ‌రు ట్రీట్మెంట్ తీసుకున్నార‌నే పూర్తి వివ‌రాలు సేక‌రిస్తున్నారు. అలాగే ఆ RMP డాక్టర్ కి ఈ వైరస్ ఎలా సోకింది అనే విషయాలని తెలుసుకోవడానికి  ప్ర‌య‌త్నిస్తున్నారు.

డాక్టర్ కి కరోనా నిర్దారణ కావడంతో .. అతని దగ్గర వైద్యం చేయించుకున్న వారు స్వ‌త‌హాగా క‌రోనా టెస్టులు చేయుంచుకోవాల‌ని.. లేక‌పోతే వారి ఫ్యామిలీ మెంబ‌ర్స్ కి కూడా మ‌హ‌మ్మారి సోకే ప్ర‌మాదం ఉంద‌ని జిల్లా అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. దీంతో దాచేపల్లి మండలంలో 300 మంది ప్రజలు పరీక్షల చేయించుకునేందుకు ముందుకువచ్చారు.వీరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.  అయితే , రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన 502 కేసుల్లో ఎక్కువగా... ఢిల్లీ జమాత్‌ కు వెళ్లి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యులే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 16 మంది డిశ్చార్జ్ అవగా... 11మంది మరణించారు. 
Tags:    

Similar News