ఎంత అమానుషం. మరెంత దుర్మార్గం. మాటల్లో చెప్పలేని దారుణం చోటు చేసుకుంది. మనిషి అన్నోడి మానవత్వం రోజురోజుకీ ఇంకిపోతుందా? చేసిన దారుణానికి చింతించాల్సింది పోయి.. తప్పించుకునే ధోరణిని ప్రదర్శించిన బరి తెగింపు చూస్తే ఒళ్లు మండక మానదు. యాక్సిడెంట్ చేసి.. ఒకరి మృతికి కారణం కావటమే కాదు.. ఆ మృతదేహం కారు మీద పడితే పట్టించుకోకుండా కిలో మీటరు మేర వెళ్లిపోయిన విధానం సంచలనం రేకెత్తిస్తోంది. తెలంగాణలోని నల్గొండలో చోటు చేసుకున్న ఈ ఘటన చూసిన ప్రతిఒక్కరూ చలించిపోతున్నారు.
నల్గొండ జిల్లా కట్టంగూర్ వద్ద ఓ వృద్ధుడు రోడ్డు దాటుతున్నాడు. అంతలో అటుగా వచ్చిన ఒక కారు ఆ వృద్ధుడ్ని ఢీ కొట్టింది. జవసత్వాలు ఉడిగిపోయిన ఈ చిన్ని ప్రాణం గాల్లో కలిసి పోయింది. వాయువేగంతో దూసుకొచ్చిన కారు దెబ్బకు అంత పెద్ద మనిషి బొమ్మలా ఎగిరిపడ్డాడు.కారు టాపు మీద వృద్ధుడు మృతదేహం పడినా.. దాన్ని పట్టించుకోకుండా వెళ్లిపోతున్న వైనం చూసిన అక్కడి స్థానికుల కోపం కట్టలు తెంచుకుంది.
వెంట పడి మరీ.. కారును అడ్డుకున్నారు. దాదాపు కిలోమీటరుకు పైనే సాగిన ఈ ఛేజింగ్ ఐటిపాముల వద్ద ముగిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని విచారణ షురూ చేశారు. తప్పు చేయటం ఒక ఎత్తు.. తప్పించుకునేందుకు మానవత్వాన్ని మర్చిపోయేలా వ్యవహరించిన తీరు షాకింగ్ గా మారింది.