ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు ఎన్నార్ నారాయణమూర్తి కుమారుడు రోహన్ మూర్తి తన భార్యతో పూర్తిగా విడిపోయారు. నాలుగేళ్ల కిందట టీవీఎస్ మోటార్స్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ కుమార్తెను లక్ష్మి వేణును పెళ్లి చేసుకున్న రోహన్ రెండేళ్లుగా ఆమెకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఇద్దరికీ విడాకులు మంజూరైనట్లు సమాచారం.
నాలుగేళ్ల కిందట రోహన్ - లక్ష్మిలకు వివాహమైంది. అయితే గత రెండేళ్లుగా వారిద్దరూ కలిసి ఉండడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్ లో చెన్నైలోని కుటుంబ న్యాయస్థానంలో విడాకులకు దరఖాస్తు చేశారు. మొన్న అక్టోబరు 31న కోర్టు వారికి విడాకులు మంజూరు చేసినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా పెళ్లయిన తరువాత రెండేళ్లకే విభేదాల కారణంగా ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. విదేశాల్లో ఉన్నత విద్య పూర్తిచేసిన ఈ ఇద్దరికీ 2010 ఆగస్టులో ఎంగేజిమెంటు జరిగింది. 2011 జూన్ లో అంగరంగవైభవంగా వీరి వివాహం జరిగింది.
అయితే... 2014లో లక్ష్మి సోదరుడు సుదర్శన్ వివాహంలో నారాయణమూర్తి కుటుంబీకులు ఎవరూ కనిపించకపోవడంతో రెండు కుటుంబాల మధ్య సంబంధాలు చెడిన సంగతి తొలిసారిగా బయటకు వచ్చింది. ఆ తరువాత విడాకుల కోసం కేసులు వేయడం.. విడాకులు మంజూరు కావడం జరిగింది.