టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మధ్య విభేదాలు ఉన్నాయని.. వీళ్లిద్దరి మధ్య కోల్డ్ వార్ సాగుతున్నట్టు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. రోహిత్ ఎదగకుండా కోహ్లీ అడ్డుకుంటున్నాడని కూడా ఆరోపణలు వినిపించాయి. గతంలో రోహిత్ ను ఆస్ట్రేలియా టూర్ కు ఎంపిక చేయకపోవడానికి కారణం కూడా కోహ్లీ యేనని వార్తలు వచ్చాయి. అయితే ఇదంతా మీడియా సృష్టి అని వాళ్లిద్దరి మధ్య ఏ గొడవ లేదని కూడా కొందరు మాజీ క్రికెటర్లు అన్నారు. అయితే చాలా సందర్భాల్లో వీళ్లిద్దరి మధ్య గొడవలు బయటపడ్డాయి. ఇదిలా ఉంటే తాజాగా వీళ్లిద్దరి మధ్య ఏ గొడవలు లేన్నట్టు కొన్ని మీడియాల్లో కథనాలు వస్తున్నాయి.
ఇంతకాలం దూరం దూరంగా ఉన్న ఈ క్రికెటర్లు ఇప్పుడు మళ్లీ ఫ్రెండ్స్ అయిపోయారని వార్తలు వస్తున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ గొప్ప క్రికెటర్లే. అయితే ముంబై ఇండియన్స్ ఐపీఎల్ లో చాంపియన్‌గా నిలబడ్డాక రోహిత్ శర్మను కెప్టెన్ చేయాలన్న వాదన తెరమీదకు వచ్చింది.అయితే ఐపీఎల్ కు ఇంటర్నేషనల్ మ్యాచ్ లకు సంబంధం ఏమిటని కూడా కొందరు కొట్టి పారేశారు.
ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన సీరిస్ లో వీళ్లిద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరినట్టు వార్తలు వస్తున్నాయి.
ఆఖరి టీ20లో వీరి మధ్య ఉన్న సమన్వయం ఆకట్టుకుంది. ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మ స్వేచ్ఛగా ఆడేలా అవకాశం ఇచ్చారు. ఫీల్డింగ్ టైంలోనూ ఇద్దరూ అనేక విషయాలను చర్చించుకున్నారు. మ్యాచ్ చూస్తున్నవారందరికీ ఈ విషయం అర్థమైంది. అంతే కాదు మ్యాచ్ గెలిచాక కూడా వీరిద్దరు ఒకరినొకరు హగ్ చేసుకోవడం చూస్తే వీరి మధ్య ఎలాంటి విభేదాల్లేవని విషయం స్పష్టమైంది. దాంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
వన్డే ప్రపంచకప్ తుది జట్టు విషయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి విభేధాలు తలెత్తాయని వార్తలొచ్చాయ్. ఆ టైంలోనే కోహ్లీ, అనుష్క ఇన్‌స్టా ఖాతాలను రోహిత్ అన్ ఫాలో చేశాడు. దీంతో ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరింది. అంతేకాక అనుష్క శర్మ కూడా రోహిత్‌తో పాటు అతని సతీమణి రితికాను అన్ ఫాలో చేయడం వీరి మధ్య విభేదాలు నిజమే అనుకునేలా చేశాయి. మరోవైపు ఆస్ట్రేలియా టూర్ కు రోహిత్ శర్మను పక్కకు పెట్టారు. ఇందుకు కోహ్లీనే కారణమన్న ఆరోపణలు వచ్చాయి. ఇదిలా ఉంటే అప్పట్లో సెలక్టర్లు మాత్రం .. రోహిత్ కు ఫిట్నెస్ లేకపోవడం వల్లే అతడిని తప్పించామని చెప్పుకొచ్చారు. అయితే అదేరోజు ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ ఫిట్ గానే ఉన్నాడంటూ ఓ వీడియోను విడుదల చేసింది. దీంతో వివాదం రాజుకున్నది.