సెంచరీతో రోహిత్ శర్మ అరుదైన ఫీట్!

Update: 2019-07-02 12:10 GMT
ఒకే ప్రపంచకప్ లో నాలుగు సెంచరీలు సాధించిన అరుదైన రికార్డును సాధించాడు రోహిత్ శర్మ. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో రోహిత్ సెంచరీతో తన ఫామ్ ను చాటుకున్నాడు. ఈ ప్రపంచకప్ లో రోహిత్ కు ఇది నాలుగో సెంచరీ.

ఇది వరకూ సౌతాఫ్రికా - పాకిస్తాన్ - ఇంగ్లండ్ జట్ల మీద రోహిత్ సెంచరీలు సాధించాడు. బంగ్లాతో సెంచరీ ద్వారా ఒకే ప్రపంచకప్ లోనాలుగు సెంచరీలు సాధించిన బ్యాట్స్ మన్ గా నిలుస్తున్నాడు రోహిత్. ఇంకా ఈ ప్రపంచకప్ లో టీమిండియాకు మరిన్ని మ్యాచ్ లు మిగిలే ఉన్నాయి.

ఇంకో లీగ్ మ్యాచ్ ఉంది. సెమిస్ కు కూడా వెళ్లినట్టే. ఇలాంటి నేపథ్యంలో రోహిత్ కు ఇంకా సెంచరీల అవకాశాలున్నట్టే. ఇది వరకూ ఒకే ప్రపంచకప్ లో నాలుగు సెంచరీలతో సత్తా చాటిన బ్యాట్స్ మన్ కుమార సంగక్కర మాత్రమే. రోహిత్ అలా ఆ శ్రీలంకన్ ప్లేయర్ సరసన నిలిచాడు. ఇది రోహిత్ కు రెండో ప్రపంచకప్. మొత్తం ఐదు సెంచరీలు సాధించాడు ప్రపంచ కప్ లలో. తద్వారా మరో రికార్డు సాధించాడు.

ప్రపంచకప్ మ్యాచ్ లలో ఐదు సెంచరీలు సాధించిన బ్యాట్స్ మన్ ముగ్గురే. పాంటింగ్ - కుమార సంగక్కర - రోహిత్ ఈ జాబితాలో ఉన్నారు. ఇక ఆరు సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్ మన్ గా ఉన్నాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.
Tags:    

Similar News