బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర సంఘటన ఒకటి చోటు చేసుకుంది. వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ లో పసికూనపై టీమిండియా చచ్చి చెడి గెలిచింది. బంగ్లాదేశ్ తో ఇంత కష్టంగా గెలవటాన్ని సగటు అభిమాని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా చోటుచేసుకున్న రెండు ఘటనలు మాత్రం ఇప్పుడు అభిమానుల్ని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.
ఈ మ్యాచ్ చూసేందుకు 87 ఏళ్ల చారులత అనే మహిళ రావటం.. ఆమె టీవీలో పదే పదే కనిపించటం.. చివరకు కోహ్లీ.. రోహిత్ శర్మలు ఇద్దరు వెళ్లి ఆమెతో మాట్లాడి.. ఆశీర్వాదం తీసుకోవటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మరో ఆసక్తికర సంఘటన కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. బంగ్లా మ్యాచ్ లో ఆరంభం నుంచి బౌండరీలతో ఉతికేసిన రోహిత్ ఈ మ్యాచ్ లో మొత్తంగా ఐదు సిక్సర్లు కొట్టాడు. ఈ సందర్భంగా కొట్టిన ఒక సిక్సర్ స్టేడియంలో ఉన్న ఒక మహిళా అభిమానికి తగిలింది. దీంతో ఆమె కాస్త ఇబ్బంది పడ్డారు.
104 పరుగులు చేసి ఔట్ అయిన రోహిత్ స్టాండ్స్ లోకి వెళుతూ.. తన సిక్సర్ కారణంగా దెబ్బ తగిలిన వారు ఎవరని అడగటం కనిపించింది. అక్కడితో ఈ విషయం పూర్తి కాలేదు. తాను కొట్టిన బంతి తగిలిన మహిళా అభిమానిని మ్యాచ్ పూర్తి అయ్యాక పిలిపించి మాట్లాడారు. అంతేకాదు ఆమె హ్యాట్ మీద సంతకం చేసి మరీ ఇచ్చారు. ఆమెతో కలిసి ఫోటోలు దిగారు. దీంతో సదరు అభిమాని ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు బీసీసీఐ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. రోహిత్ తీరుకు నెటిజన్లు ఫిదా కావటమే కాదు.. ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రోహిత్ శర్మ చేసిన పనితో ఇకపై సిక్సర్ల బంతి నేరుగా వచ్చి తమనే తాకాలని అభిమానులు కోరుకుంటారేమో?