ఐసీపీ వరల్డ్ కప్-2019 చివరి అంకానికి వచ్చేసింది. లీగ్ దశ ఇప్పటికే ముగిసిపోగా... నాకౌట్ ఫైట్ కు రంగం సిద్ధం అయిపోయింది. లీగ్ దశ చివరికి వచ్చినప్పుడే... ఈ సారి కప్ కొట్టేదెవరన్న అంశంపై పెద్ద ఎత్తున ఊహాగానాలు - విశ్లేషణలు మొదలైపోయాయి. లీగ్ దశ ముగిసి సెమీస్ ప్రారంభమైపోతున్న నేపథ్యంలో ఈ అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఫైనల్ కు వచ్చే జట్లు ఇవేనంటూ కొందరు చెబుతుంటూ... ఈ సారి కప్ ఈ దేశ జట్టుదేనని తెగేసి చెబుతున్న వారూ ఉన్నారు. ఈ క్రమంలో కప్ ఎవరిదన్న మాటే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారితే... దానికి ఏమాత్రం తగ్గనట్టుగా మరో అంశం కూడా ఇప్పుడు ఓ రేంజిలో వైరల్ అయిపోతోంది. అదే ఈ మెగా టోర్నీలో టాప్ స్కోరర్ గా నిలిచేదెరవన్నది?. నిజమే... ఇప్పుడు ఈ విషయంపై బాగానే చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం లీగ్ దశ ముగిసే సరికి ఏకంగా ఐదు సెంచరీలతో సత్తా చాటిన టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 647 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. అతడి తర్వాత 638 పరుగులతో ఆసీస్ స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ ఉన్నాడు. వీరిద్దరికీ ఇంకో మినిమమ్ ఓ మ్యాచ్ - మ్యాగ్జిమమ్ రెండు మ్యాచ్ లు ఆడే అవకాశం ఉంది. రేపు జరిగే తొలి సెమీస్ లో భారత్ వర్సెస్ న్యూజిల్యాండ్ మ్యాచ్ ద్వారా రోహిత్ కు మరో మంచి అవకాశం ఉంది. ఇప్పటిదాకా కొనసాగించిన ఫామ్ ను రోహిత్ కొనసాగిస్తే... టాప్ స్కోరర్ గా రోహిత్ ను వెనక్కు నెట్టడం ఏ ఒక్క ఆటగాడికి సాధ్యం కాదనే చెప్పాలి.
ఇక రేపటి మ్యాచ్ లో టీమిండియా గెలిచి ఫైనల్ చేరితే... రోహిత్ కు మరో మంచి అవకాశం దక్కినట్టే. ఈ లెక్కన హిట్ మ్యానే... టాప్ స్కోరర్ గా నిలుస్తాడని మెజారిటీ క్రికెట్ అభిమానులు లెక్కలేస్తున్నారు. ఇక రోహిత్ కంటే కేవలం 9 పరుగులు మాత్రమే వెనకబడి ఉన్న వార్నర్ కూడా టాప్ స్కోరర్ గా నిలిచే అవకాశాలు లేకపోలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఆసీస్ కు కూటా సెమిస్ ద్వారా ఓ ఛాన్స్ - అందులో గెలిస్తే ఫైనల్ ద్వారా మరో ఛాన్స్ దక్కినట్టే. అంటే రోహిత్ మాదిరే... వార్నర్ కు కూడా రెండు ఛాన్సులున్నట్లు చెప్పాలి. సరే టాప్ స్కోరర్ వీరిద్దరిలో ఎవరు నిలిచినా... క్రికెట్ దేవుడిగా గుర్తింపు సంపాదించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ వరల్డ్ కప్ లో అత్యధిక పరుగుల రికార్డు బద్దలు కావడం ఖాయంగానే కనిపిస్తోంది.
2003 వరల్డ్ కప్ మెగా టోర్నీలో సచిన్ ఏకంగా 673 పరుగులు చేశాడు. ఇప్పటిదాకా ఏ వరల్డ్ కప్ లో అయినా అత్యధిక పరుగుల రికార్డు సచిన్ పేరిటే ఉందన్న మాట. ఇప్పుడు హిట్ మ్యాన్ కొట్టినా - వార్నర్ కొట్టినా... ఈ రికార్డు బద్దలు కావడం ఖాయమే. ఇక సచిన్ తర్వాత వరల్డ్ కప్ లో సెంకడ్ హయ్యెస్ట్ స్కోరర్ గా నిలిచిన ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ పేరిట ఉన్న 659 పరుగుల రికార్డు కూడా గల్లంతు కావడం ఖాయమే. మొత్తంగా టాప్ స్కోరర్ కు సంబందించి ఇప్పటిదాకా చెక్కు చెదరకుండా ఉన్న రెండు రికార్డులను బద్దలు కొట్టే ఛాన్స్ ఉన్నందుననే... ఈ మెగా టోర్నీలో టాప్ స్కోరర్ ఎవరన్న అంశంపై అమితాసక్తి నెలకొంది. ఫామ్ పరంగా చూస్తే... ఈ అవకాశం హిట్ మ్యాన్ రోహిత్ శర్మకే ఉన్నట్లుగా కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.