టీడీపీకి వైసీసీ ఎమ్మెల్యే రోజా గట్టి కౌంటర్ ఇచ్చారు. జగన్ హామీలపై టీడీపీ విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నామన్నారు. రేపు చంద్రబాబు నాయుడు రాజీనామా చేసి, జగన్ని కుర్చీలో కూర్చోబెడితే తాము ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తామో మీరే చూస్తారని టీడీపీ నేతలకు ఝలక్ ఇచ్చారు. టీడీపీ బుర్రపెట్టి ఆలోచిస్తే. 2019 నాటికి...10 లక్షల కోట్ల బడ్జెట్లో జగన్ చెప్పిన పథకాలన్నీ అమలవుతాయన్నారు. అసెంబ్లీని సమావేశపరిస్తే లెక్కలతో సహా వైఎస్ జగన్ సమాధానం చెబుతారన్నారు. రోజా మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు.
గతంలో టీడీపీ జగన్ ను చూసి మాత్రమే భయపడేదని, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ను చూసి కూడా వణికిపోతోందన్నారు. ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకున్న ప్రధాని మోదీకి నాయకత్వం లోపించే సలహాలు తీసుకున్నారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు గత ఎన్నికల్లో మోదీతో జతకట్టి పవన్ కల్యాణ్ కాళ్లు ఎందుకు పట్టుకున్నారో చెప్పాలన్నారు.
సీఎం చంద్రబాబు అనుభవనం రాష్ట్రాన్ని దోచుకోవటానికే పనికి వచ్చిందన్నారు. ఆయన కేబినెట్ లో ఇద్దరు మహిళలు మాత్రమే ఉన్నారని, ఎక్కడ పడితే అక్కడ మద్యం దుకాణాలు పెట్టి మహిళల తాళిబొట్టు తెంచుతున్న వారు మహిళల గౌరవంపై మాట్లాడడమేటిని ధ్వజమెత్తారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి విజయవాడకు పారిపోయారు. అసెంబ్లీలో ఓటుకు నోటు గురించి మాట్లాడితే స్పీకర్ కోడెల శివప్రసాద్ మాట్లాడనివ్వరని, అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మాట్లాడకూడదని చెబుతారని, అదే జగన్ కేసు విషయం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ గంటలు గంటలు మాట్లాడుతారన్నారు.
మంత్రి లోకేశ్ నుచూస్తే కామెడీ ఆర్టిస్ట్ గుర్తొస్తారు. ప్రతిదానికి లోకేష్ సవాల్ విసురుతారు. ఆయన యాష్ ట్రేకు ఎక్కువ - డస్ట్ బిన్ కు తక్కువ. లోకేష్ కు దమ్ము - ధైర్యం ఉంటే ఇసుక దోపిడీ - విశాఖ భూ కుంభకోణం - మద్యం లైసెన్స్ ల అవకతవకలపై సీబీఐ విచారణకు సిద్ధం కావాలన్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు - పరిటాల రవి హత్య కేసులో ఆరోపణలు వస్తే దమ్మున్న వైఎస్ ఆర్ సీబీఐ విచారణ వేశారని గుర్తు చేశారు. తండ్రీకొడుకులు తుప్పు కాదు నిప్పు అని అనుకుంటే సీబీఐ విచారణకు సిద్ధం కావాలన్నారు.
లోకేశ్ ఇంకోసారి సవాల్ విసిరితే. డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకెళ్లి తొడ కొడితే ఏం అవుతుందో పప్పుకు కూడా అదే పరిస్థితి ఎదురు అవుతుంది’ అని ఎద్దేవా చేశారు. నెల్లూరు ప్రజలు ఛీకొట్టి తరిమేసిన సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారని రోజా అన్నారు. సోమిరెడ్డి చెప్పేదంతా సోదేనని, అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు కాబట్టే ఆయనకు చంద్రబాబు మంత్రిపదవి కట్టబెట్టారన్నారు.