లోకేశ్ మీద రోజా పంచ్ అదిరింద‌ట‌

Update: 2017-04-07 07:04 GMT
ఫైర్ బ్రాండ్ రోజా మాట‌లు ఎంత వాడిగా.. వేడిగా ఉంటాయో తెలిసిందే. తాజాగా ఏపీ సీఎం కుమారుడు లోకేశ్ పై చేసిన కామెంట్ అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆకర్షిస్తోంది. క‌త్తితో కోసిన‌ట్లుగా ఉండే ఆమె మాట‌లు లోకేశ్ కు ఇబ్బంది క‌లిగించేవే. కొత్త‌గా మంత్రి అయిన లోకేశ్ ఒక ప‌ప్పు.. మ‌రో మంత్రి అయ్య‌న్న ఎర్రిప‌ప్పు అంటూ ఆమె ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు.

విభ‌జ‌న సంద‌ర్భంగా విశాఖ‌కు ప్ర‌త్యేక రైల్వే జోన్ కేటాయించే విష‌యంలో హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. మోడీ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చి మూడేళ్ల‌కు ద‌గ్గ‌ర ప‌డుతున్నా.. ఇప్ప‌టివ‌ర‌కూ ఆ ఊసు ఎత్తిందే లేదు. ఎప్పుడైనా ఈ అంశం మీద రైల్వే మంత్రిని అడిగితే.. అదిగో.. ఇదిగో అన‌ట‌మే త‌ప్పించి చేస్తున్న‌ది ఏమీ లేద‌ని చెప్పాలి. విశాఖ రైల్వేజోన్ సాధ‌న విష‌యంలో కేంద్రానికి త‌గ్గ‌ట్లే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సైతం పట్టించుకున్న‌ది లేదు. ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం ఎంత‌కైనా పోరాడ‌తాన‌ని గొప్ప‌లు చెప్పే ఆయ‌న‌.. జోన్ గురించి చేయాల్సిన దాని కంటే త‌క్కువే చేశార‌న్న విమ‌ర్శ ఉంది.

ఇదిలా ఉంటే.. ఈ అంశంపై ఇప్ప‌టికే ప‌లుమార్లు నిర‌స‌న‌లు.. ఆందోళ‌న‌లు.. ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన ఏపీ విప‌క్షం వైఎస్సార్ కాంగ్రెస్‌.. తాజాగా పాద‌యాత్ర‌ను చేప‌ట్టింది. విశాఖ‌కు రైల్వేజోన్ ప్ర‌క‌టించాల‌న్న డిమాండ్‌ తో నిర్వ‌హించిన పాద‌యాత్ర‌లో ఫైర్ బ్రాండ్ రోజా కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఆమె.. లోకేశ్‌.. అయ్య‌న్న‌పాత్రుడిపై ప‌ప్పు.. ఎర్రిప‌ప్పు అంటూ చేసిన వ్యాఖ్య‌లు తెలుగు త‌మ్ముళ్ల‌కు మంట పుట్టిస్తున్నారు.

విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీకి న్యాయ స‌మ్మ‌తంగా రావాల్సిన ప్ర‌త్యేక హోదా.. రైల్వే జోన్ విష‌యాన్ని ఏపీ అధికార‌ప‌క్షం ప‌ట్టించుకున్న‌ది లేద‌ని ఆమె మండిప‌డ్డారు. ఓటుకు నోటు కేసుకు భ‌య‌ప‌డుతున్న చంద్ర‌బాబు విశాఖ‌కు రైల్వే జోన్ విష‌యం గురించి నోరు విప్ప‌టం లేద‌ని ఆరోపించారు. ఏపీకి చెందిన మ‌రో ఎంపీ గంటా శ్రీనివాస‌రావు బ్యాంకుల‌కు రూ.200 కోట్లు ఎగ‌నామం పెట్టి.. దాని నుంచి త‌ప్పించుకునేందుకు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న‌ట్లుగా రోజా విమ‌ర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద చ‌ర్య‌లు తీసుకునే అధికారాన్ని స్పీక‌ర్ నుంచి త‌ప్పించాల‌ని చెప్పారు. మండే ఎండ‌ల్లో మ‌రింత మంటెక్కించేలా ఉన్న రోజా మాట‌ల‌తో ఏపీ టీడీపీ నేత‌ల‌కు మ‌రింత మంట పుట్టిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News