వైసీపీ ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీలోకి అనుమతించడమనే ఎపిసోడ్ ముదిరిపాకాన పడుతోంది. రోజాను సభలోకి అనుమతించాలని ఉమ్మడి రాష్ర్టాల హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఏపీ అసెంబ్లీ స్పీకర్ బేఖాతర్ చేయడం, అధికార టీడీపీ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేయడం వివాదానికి కారణంగా మారుతోంది. ఈ తీరు పట్ల సహజంగానే ప్రతిపక్ష వైసీపీ సభ్యులు మండిపడుతున్నారు. రోజాను సభలోకి అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ గవర్నర్ నరసింహన్ ను కలిసి వైసీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు.
అనంతరం అక్కడే ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంపై, స్పీకర్‌పై ఫైర్ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి - స్పీకర్ కు ప్రజాస్వామ్యమన్నా, న్యాయస్థానాలన్నా గౌరవంలేదని విమర్శించారు. అసెంబ్లీకి స్పీకర్ సుప్రీం అనే విషయాన్ని ఎవరూ కాదనలేరని అయితే స్పీకర్ చట్ట విరుద్దంగా, హద్దుమీరి వ్యవహరించినపుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయన్న విషయాన్ని కూడా గమనించాలని రోజా అన్నారు. స్పీకర్ సుప్రీం అయితే మాత్రం రోజాను ఉరితీయమంటే తీస్తారా? అని ఆమె నిలదీశారు.
ఏపీ చంద్రబాబు సర్కారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలుజేసిందని రోజా ఫైరయ్యారు. తాను మహిళల కోసం పోరాటం చేస్తున్నందునే టీడీపీ ప్రభుత్వం తనను టార్గెట్ చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించే రోజు త్వరలోనే వస్తుందని హెచ్చరించారు.