అప్పుడెప్పుడో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధమేనని టాలీవుడ్ స్టార్ హీరో - జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను జగన్ తో కలిసి పనిచేయడానికి ఏమాత్రం సంకోచించను అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో అధికార పార్టీ టీడీపీతో పెద్ద గుబులునే రేపాయి. ఆ తర్వాత పవన్ ఆ మాటే మరిచిపోయారనుకోండి. అయితే మరి ప్రజా సమస్యల కోసం జగన్ తో పవన్ ఎందుకు కలవడం లేదన్న ప్రశ్న ఇప్పుడు జనానికి గుర్తు చేశారు వైసీపీ ఫైర్ బ్రాండ్ - ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగానే కాకుండా.. చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే రోజా. అయినా జగన్ తో పవన్ కలయిక సాధ్యమయ్యేదేనా అంటూ కూడా రోజా చేసిన వ్యాఖ్యలు కాస్తంత ఆసక్తికరంగానే ఉన్నాయని చెప్పక తప్పదు. అసలు పవన్ తో జగన్ కలిసే ప్రసక్తే లేదని, పవన్ - జగన్ ల మధ్య నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని కూడా రోజా చెప్పేశారు.
రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మహిళలకు రక్షాబందన్ శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబునాయుడు ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన రోజా... పనిలో పనిగా పవన్ కల్యాణ్ పైనా విరుచుకుపడ్డారు. ఈ రోజు చేనేత దినోత్సవమన్న విషయాన్ని గుర్తు చేసిన రోజా... చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పుడు మాట్లాడతావంటూ ఆమె పవన్ ను దాదాపుగా నిలదీసినంత పనిచేశారు. అయినా అప్పుడెప్పుడో చేనేత కార్మికుల సమస్యలంతా తన సమస్యలేనని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవలి పవన్ చిత్రం కాటమరాయుడు రిలీజ్ సందర్భంగా తాను చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ ను అని కూడా ఆయన ప్రకటించుకున్న విషయం కూడా మనకు తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావించిన రోజా... నాడు పెద్ద పెద్ద ప్రకటనలు చేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడేమైపోయారంటూ ప్రశ్నించారు.
చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌ని అని ప్రకటించుకుని తన సినిమాకు మంచి ప్రమోషన్ చేసుకున్న పవన్ కల్యాణ్... ఇప్పుడు చేనేత కార్మికుల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించిన రోజా... *అసలు కాటన్ రాయుడు ఎక్కడున్నాడో* అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇకపోతే... జగన్ కు - పవన్ కు మధ్య ఉన్న తేడాను కూడా రోజా ఈ సందర్భంగా కాస్తంత విడమరిచే చెప్పేశారు. ఇచ్చిన హామీని మరిచి తన పనిలో పడిపోయే పవన్... మాట తిప్పని, మడమ తిప్పని వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అసలు సాటే రారని కూడా ఆమె చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ మాటిస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాటిచ్చినట్లేనన్న రోజా... ఈ విషయంలో తన తండ్రిలాగే జగన్ కూడా మాట తప్పరు - మడం తిప్పరని ప్రకటించారు. వైఎస్ ఆర్ సీపీ అధికారంలోకి రాగానే చేనేత సమస్యలను పరిష్కరిస్తామని కూడా రోజా చెప్పారు. కాటన్ రాయుడు ఎక్కడ అంటూ రోజా చేసిన కామెంట్ పై జనసేన నేతలుగానీ, పవన్ కల్యాణ్ గానీ స్పందిస్తారో, లేదో చూడాలి.