ఎంపీలు ఢల్లీి బసకు రూ.35 కోట్లు

Update: 2015-04-13 12:04 GMT
  ప్రజాప్రతినిధుల ఖర్చులకు లెక్కుండడం లేదు... అంతేకాదు, అడ్డూఅదుపూ కూడా ఉండడం లేదు. సాధారణంగా పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడ... మంత్రులు, ప్రధానితో మాట్లాడేందుకు వచ్చేటప్పుడె ఎంపీలు ఢల్లీిలో వివిధ హోటళ్లలో బస చేస్తారు. కానీ.... ఇప్పుడు ఇండియాలో ప్రధాని లేరు, విదేశాలకు వెళ్లారు. మంత్రులు కూడా కొందరు విదేశాల్లోనే ఉన్నారు. పార్లమెంటు కూడా జరగడం లేదు. అయినా ఎంపీలు మాత్రం ఢల్లీి హోటళ్లలో తిష్ట వేశారు. వారు హోటళ్లలో ఉంటే నష్టమేంటి అనుకోవద్దు... అదంతా ప్రభుత్వ ఖర్చుతోనే కావడంతో ప్రజాధనానికి కాళ్లస్తున్నాయి మరి.

    పార్లమెంటు సమావేశాలప్పుడు ఎంపీలకు హోటళ్లలో ఉండేందుకు గవర్నమెంటు బిల్లు చెల్లిస్తుంది. ప్రభుత్వ కార్యక్రమాలు, పనులపై వచ్చేటప్పుడూ గవర్నమెంటే బిల్లులు చెల్లిస్తుంది. అయితే... ఇప్పుడు అలాంటివేమీ లేకుండానే 35 మంది ఎంపీలు ఢల్లీి హోటళ్లలో ఉంటూ బిల్లులు తీసుకుంటున్నారు. ఈ సౌకర్యాన్ని ఎంపీలు చాలామంది దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఎంపీలు తమతమ నియోజకవర్గాల్లో ఉంటున్నప్పుడు కూడా ఢల్లీిలో హోటల్‌ రూంలు బుక్‌ చేసి ఉంచుతున్నారు.  వారి అనుచురులు వాడుకుంటున్నారు. ఢల్లీిలో హోటళ్లలో సూట్‌ కు రోజుకు రూ.10 వేల నుంచి 14 వేల వరకు బిల్లు అవుతుంది. మోడీ గవర్నమెంటు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఇలా రూ.35 కోట్లు ఎంపీల హోటల్‌ బిల్లులకే ఖర్చయ్యాయట. దీంతో కాస్టు కటింగులో భాగంగా కేవలం పార్లమెంటు సమావేశాలు ఉన్న కాలానికే బిల్లులు ఇచ్చేలా జీవో జారీ చేయాలని కేంద్రం ప్లాను చేస్తోంది.
Tags:    

Similar News