దేశ విభజన తర్వాత పాకిస్థాన్ కు ఆ పేరు ఎందుకు వచ్చింది? దాన్ని భారత్ అని ఎందుకు పెట్టుకోలేదు? లాంటి ప్రశ్న ఎవరైనా వేస్తే కాస్తంత ఆశ్చర్యంగా చూస్తాం. దేశం నుంచి విడిపోయిన భాగానికి భారత్ అని కాకుండా పాక్ అని పెట్టుకోవటం వెనుక అసలుసిసలు కారణం ఏమిటన్న విషయాన్ని ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా వ్యాఖ్యానించారు.
అవిభాజ్య భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోయినప్పుడు.. ఆ దేశాన్నిపాకిస్థాన్ గా అభివర్ణించారని.. దీనికి కారణం లేకపోలేదన్న మోహన్ భగవత్.. ఆ దేశంలో భారత్ పేరు పెట్టుకునేంత లక్షణాలు ఏమీ కనిపించలేదని.. ఆ కారణంగానే వారు వేరే పేరు పెట్టుకోవాల్సి వచ్చిందన్నారు. భారతదేశాన్ని సంపన్న దేశంగా చేయటమే తమ లక్ష్యంగా చెప్పిన మోహన్ భగవత్.. ప్రపంచమంతా భారత్ మాతా కీ జై అని నినాదాలు చేయాలని తమ సంస్థ భావిస్తుందని చెప్పుకున్నారు. ప్రపంచ దేశాల వరకూ ఎందుకు.. దేశంలోని వారంతా భారత్ మాతా కీ జై అంటే చాలన్న విషయాన్ని మోహన్ భగవత్ గుర్తిస్తారా..?