మామూలు పారిశ్రామిక వేత్తగా ఉన్న ఆయనను స్వయంగా చంద్రబాబు నాయుడే పెంచి పెద్ద చేశారు. తన మీద సొంత పార్టీలో ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ.. అప్పట్లో తమకు పరిమితంగా ఉన్న అవకాశాన్ని ఆయనకే కట్టబెట్టి ఉన్నత పదవిలోకి పంపారు. అలాంటి ప్రయోజనాన్ని చంద్రబాబు నుంచి పొందిన సీనియర్ నేత ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నట్లుగా వస్తున్న పుకార్లు తెదేపా వర్గాలనే నిర్ఘాంత పరుస్తున్నాయి. కేంద్రమంత్రి సుజనాచౌదరి భాజపాతో సన్నిహితంగా మెలగుతున్నారని, ఢిల్లీ పెద్దలతో సంబంధాలు పటిష్టం చేసుకుంటున్నారని, బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంతంగా తమ పార్టీ అస్తిత్వాన్ని పెంచుకోవాలని భాజపా చాలా కాలంగా వ్యూహరచన చేస్తున్న నేపథ్యంలో.. సుజనా చౌదరి కూడా వారితో జట్టు కడతాడనే వార్త బలంగా వినిపిస్తోంది. సుజనాకు కొన్నాళ్లుగా చంద్రబాబునాయుడుతో పొరపొచ్చాలు ఉన్నాయని, ఆ నేపథ్యంలో తనకు తొలి రాజకీయ అవకాశం కల్పించిన పార్టీని వీడిపోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నారని సమాచారం. తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనను రాజ్యసభ ఎంపీని చేసిన చంద్రబాబు అప్పట్లో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. ఆతర్వాత కేంద్రమంత్రిని కూడా చేశారు. రెండోసారి కూడా రాజ్యసభ అవకాశం కల్పించారు. అయితే ఇకపై కుదరదని చంద్రబాబు అప్పట్లో తేల్చిచెప్పేశారట కూడా. దాంతో కమలం పార్టీలో చేరి.. రాజకీయాల్లో స్థిరంగా ఉండాలని సుజనా చౌదరి అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో స్వతంత్రంగా ఎదగాలని కోరుకుంటున్న భాజపా.. కమ్మ సామాజిక వర్గం మద్దతును కూడా బలంగా ఆశిస్తోంది. ఆ పార్టీకి ప్రస్తుతం ఉన్న కంభంపాటి హరిబాబు పనితీరు మీద వారికి అసంతృప్తి ఉంది. పురందేశ్వరి వంటి వారు చురుగ్గానే ఉన్నప్పటికీ.. ఇంకా బలం పెంచుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. సుజనా చౌదరి ఆ పార్టీ పంచకు చేరితే.. వారి కోరిక కూడా నెరవేరవచ్చు. మొత్తానికి.. చంద్రబాబుకు కీలంగా సహకరించిన నేత- ఇటీవలి కాలంలో దూరం జరుగుతున్నట్లుగా ప్రచారంలో ఉన్న నేత ఏకంగా పార్టీనే వీడనున్నట్లు పుకార్లు వస్తున్నాయి.