రూపాయి ఢమాల్..జీవితకాలంలోనే కనిష్టం..

Update: 2018-10-03 10:33 GMT
బీజేపీ పాలనలో దేనికి నియంత్రణ లేకుండా పోతోంది. రోజు రోజుకి పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. గ్యాస్ ధర కొండెక్కి కూర్చుంది. నిత్యావసరాలు మండిపోతున్నాయి. తాజాగా రూపాయి పతనం దేశ ఆర్థిక వ్యవస్థనే కృంగదీస్తోంది.

అమెరికా డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోతోంది. ఈ పతనం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అమెరికా డాలర్ కు డిమాండ్ పెరిగిపోవడంతో దేశీయ రూపాయి భారీగా క్షీణిస్తోంది. మార్కెట్ చరిత్రలోనే తొలిసారిగా రూ.73 మార్క్ ను దాటడం గమనార్హం.

బుధవారం డాలర్ తో రూపాయి మారకం విలువ 73.34కు చేరింది. ఇదే అత్యంత జీవనకాల కనిష్టం అని మార్కెట్ వర్గాలంటున్నాయి. మంగళవారం 72.91 వద్ద స్థిరపడ్డ రూపాయి.. బుధవారం ఏకంగా 35 పైసలు నష్టపోవడం మార్కెట్ వర్గాలను షాక్ కు గురిచేసింది. ప్రస్తుతం 73.33 వద్ద రూపాయి మారకం విలువ ఉంది. రూపాయి విలువ పడిపోవడానికి విదేశీ పెట్టుబడులు వెనక్కి తీసుకోవడమే కాకుండా ముడిచమురు ధరలు పెరగడమే ప్రధాన కారణంగా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దిగుమతుల నుంచి డాలర్ కు డిమాండ్ పెరగడం కూడా రూపాయి పడిపోవడానికి కారణమవుతోంది.


Tags:    

Similar News