రస్పరం తీవ్ర విమర్శలు...ఒకరిపై ఇంకొకరు దౌత్యరీతిని మరిచిపోయిన విధంగా విరుచుకుపడే కామెంట్లతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ - ఉత్తరకొరియా రథసారథి కిమ్ జోంగ్ ఉన్ యుద్ధవాతావరణాన్ని సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఒకర్ని ఒకరు పిచ్చోడు అనుకోవడం వరకు కూడా ఈ వాగ్వాదం చేరిపోయింది. ఉత్తర కొరియాను పూర్తిగా నాశనం చేస్తానని ట్రంప్ కామెంట్ చేస్తే ఉన్మాదంతో ఊగిపోతున్న ఓ పిచ్చోడిగా ట్రంప్‌ను ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రి యాంగ్ హో ఎద్దేవా చేశారు. దీంతో మండిపడిన ట్రంప్ ఉత్తర కొరియా ఇంకా ఎక్కువ రోజులు ఉండదంటూ సంచలన జోస్యం చెప్తూ ట్వీట్ చేశారు
ఇలా రెండు కీలక దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న సందర్భంలో అసలింతకీ ఈ యుద్ధం అంటూ వస్తే ఎవరికి నష్టం అనే సందేహం అందరిలో నెలకొంది. దీనికి రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్జే లావ్‌రోవ్ ఓ ఇంటర్వ్యూలో ఆశ్చర్యకరమైన మాట చెప్పారు. యుద్ధం అంటూ వస్తే అమెరికాకే నష్టమని తేల్చేశారు. అదేంటి అగ్రరాజ్యం వద్ద చాలా ఆయుధాలు ఉన్నాయి కదా అనే సందేహానికి ఆయన విశ్లేషణ ఏమిటంటే...ఉత్తరకొరియా ప్రయోగించే క్షిపణులను ఎదుర్కునే సత్తా వాటికి లేదు కాబట్టి.
దాదాపు 770 కి.మీ. ఎత్తులో జపాన్ మీదుగా ప్రయాణించే సామర్థ్యం కలిగి క్షిపణి వ్యవస్థను ఉత్తరకొరియా కలిగి ఉందని...ఒకవేళ యుద్ధం జరిగితే అమెరికాలోని గువామ్ ద్వీపానికి ముప్పు తప్పదని అంటున్నారు. అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థకు ఒక ఖండాంతర క్షిపణిని ఛేదించేంత సత్తాలేదని విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే....అమెరికాకు పేట్రియాట్, థాడ్, ఏజిస్ పేరుతో వరుసగా 12. 125, 1,350 మైళ్ల దూరం ప్రయాణించే మూడంచెల రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. అయితే అసలు సమస్య ఏమిటంటే...ఈ మూడు వ్యవస్థలు....ఏ క్షిపణిని అయినా ఇవి తుది, టెర్మినల్, స్టేజ్ దశలో కూల్చేందుకు సిద్ధం చేసినవే తప్ప వీటిలో ఏ ఒక్కటి ఖండాంతర క్షిపణిని ఛేదించే పరిస్థితి లేదు. దీంతో ఉత్తరకొరియాను క్షిపణిని లక్ష్యం చేసుకోవడం కష్టం అదే సమయంలో ఖండాతరం కాకపోయినా....మధ్యశ్రేణి ఖండాంతర క్షిపణిని కూడా మార్గం మధ్యలో, లాంచింగ్ దశ పూర్తయిన తర్వాత కూడా కూల్చలేవు. ఆఖరికి ఉత్తరకొరియా జామర్ల వ్యవస్థ ఎటువంటి జాగ్రత్తలు లేకుండా దీనిని ప్రయోగించినా కూల్చే అవకాశాలు సగం మాత్రమే ఉంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా అమెరికాతో మిత్రపక్షంగా ఉన్న దక్షిణ కొరియాలో ఏర్పాటు చేసిన థాడ్ వ్యవస్థలోని బ్యాటరీలు ఎన్నో క్షిపణులను అడ్డుకోలేవని కాబట్టి ఉత్తరకొరియా క్షిపణులతో ముప్పు ఖాయమంటున్నారు.
అయితే తన సైనిక సామర్థ్యం, రక్షణ నైపుణ్యం ఈ స్థాయిలో ఉన్నప్పటికీ అగ్రరాజ్యం అమెరికా కయ్యానికి కాలుదువ్వుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమెరికాకు చెందిన బాంబర్ విమానాలు ఉత్తర కొరియా-దక్షిణ కొరియాల మధ్య సైనిక రహిత ప్రాంతంలో ప్రయాణించి కలకలం రేపింది.
ఈ శతాబ్ధంలో ఒక అమెరికా విమానం ఈ ప్రాంతంలో ప్రయాణించడం ఇదే తొలిసారని తమ శత్రువును ఓడించగలమనే సందేశాన్ని పంపేందుకే...అమెరికా ఇలా చేసిందని అంటున్నారు