కర్‌లో దునియా 'చిట్టీ'మే

Update: 2015-03-20 09:42 GMT
ఎగ్జామ్స్‌ అంటే కష్టపడి చదవడమే కాదు.. కాపీ కొట్టి రాయడం కూడా. భారతదేశంలో మూలమూలనా ఈ కళలో ఆరితేరిన విద్యార్థులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అయితే హైటెక్‌ కాపీయింగ్‌ ముఠాలు ఉన్నాయి. ఎంసెట్‌లో ఇలా హైటెక్‌ పద్ధతుల్లో కాపీలు కొట్టి దొరికిపోయిన వాళ్లున్నారు. మరి బీహార్‌ ఆంధ్రప్రదేశ్‌ ఏమాత్రం తక్కువ కాదు కదా.. అందులోనూ నేరాలకు మదర్‌ల్యాండ్‌ అది. అక్కడ అంతా ఓపెన్‌... మంచైనా, చెడైనా బహిరంగంగా చేయగలిగే దమ్మూధైర్యం, సిగ్గులేనితనం ఉన్నవారు అక్కడ కోకొల్లలు. తాజాగా అక్కడ పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా ఓపెన్‌ కాపీయింగ్‌కు దిగారు.

    బీహార్‌లోని హాజీపూర్‌లో మాస్‌కాపీయింగ్‌ జోరుగా సాగుతోంది. పరీక్ష హాల్లో ఇన్విజిలేటర్లు అక్కడే ఉన్నా వారు తమకేమీ పట్టనంటే ఉంటున్నారు. విద్యార్థులంతా జేబుల్లో చిట్లీలు బయటకు తీసి ఎదురుగా పెట్టుకుని హాయిగా నిర్భయంగా రాసుకుంటున్నారు. కొందరైతే ఏకంగా పుస్తకాలు ఎదురుగా పెట్టుకుని మూకుమ్మడిగా ఒక్కచోట చేరి సమాధానాలు చకచకా రాసేస్తున్నారు.

    మరి ఇంతగా కష్టపడుతున్న తమ పిల్లలకు సాయం చేయడానికి తల్లిదండ్రులు, ఫ్రెండ్స్‌ కూడా వీలైనంత కష్టపడుతున్నారు. గోడలెక్కి... కిటికీల్లోంచి వారికి చిట్టీలు విసురుతున్నారు. ఒక్కోసారి అవి ఎగ్జామ్‌ హాల్‌లో పడకపోతే ఇన్విజిలేటర్లే స్టూడెంట్లకు తీసి అందిస్తున్నారు.

    విద్యార్థులు బెంచీలన్నీ దగ్గరగా జరుపుకొని చిట్టీలు, పుస్తకాలు ఎదురుగా పెట్టుకుని సహకార సంఘంలా కర్‌లో దునియా చిట్టీమే అనుకుంటూ 100 మార్కుల కోసం 100 శాతం కష్టపడి రాస్తున్నారు. వాళ్లలో ఎంతమంది ఇంజినీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు అయి దేశం మీద దాడి చేస్తారో...?



Tags:    

Similar News