కొన్ని స్టార్ హోటళ్లలో రేట్లు చూస్తే పగలే కంటి ముందు చుక్కలు కనిపిస్తుంటాయి. తాజాగా ఒక కేంద్రమంత్రికి ఇలాంటి అనుభవమే అయ్యింది. కాకుంటే ఆయనకు స్టార్ట్ హోటల్ కు వెళ్లకుండానే కావటం గమనార్హం. కేంద్రమంత్రి సదానందగౌడకు గ్రీన్ టీ తాగే అలవాటుంది. బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కి వెళ్లిన ప్రతిసారీ ఆయన విమానాశ్రయంలో రెస్టారెంట్ లో గ్రీన్ టీ ఒక్కటి తాగుతారు. మంత్రిగారు కావటంతో.. తాను తాగే గ్రీన్ టీ డబ్బులు జేబులో నుంచి తీసి చెల్లించరు. ఆయన ఖాతాకు వచ్చి వెళుతుంది.
నిజానికి మంత్రిగారు తాను తాగే టీ బిల్లుల లెక్క కూడా చూసుకోరు. ఇలాంటి చిల్లర లెక్కల్ని పట్టించుకునే సమయం వారికి ఉండదు కదా. కానీ.. సదానంద గౌడ్ తన ఖాతాకు వచ్చిన గ్రీన్ టీ బిల్లును చూసి అవాక్కయ్యారు. ఎందుకంటే.. ఆయన ఒక నెలలో తాగిన గ్రీన్ టీ బిల్లు మొత్తం రూ.4లక్షలు వేసేశారట. ఒక్కో గ్రీన్ టీ రేటు గరిష్ఠంగా రూ.500 వేసుకున్నా.. రోజు ఒకటి చొప్పున తాగినా రూ.15వేలకు మించి కాదు. అలాంటిది రూ.4లక్షల లెక్క చూసి షాక్ తిన్నారట.
ఈ లెక్క సంగతేంటని ఆరా తీసిన మంత్రిగారికి.. తన ప్రోటోకాల్ చూసే అధికారుల చేతివాటం ఏ రేంజ్లో ఉంటుందో బయటకు వచ్చింది. గతంలో న్యాయశాఖామంత్రిగా వ్యవహరించిన వారి దగ్గర అలవాటైన ఈ చేతివాట సదానంద దగ్గరకు వచ్చేసరికి మరింత బరితెగింపుగా మారిందట. గతంలో ఇదే తరహా టీ తాగిని దానికి రూ.30 నుంచి రూ.40వేల వరకూ బిల్లులు వేసేవారట. అయితే.. అప్పటి మంత్రులు ఈ విషయాల్ని లైట్ తీసుకోవటంతో బయటకు రాలేదు. తాజాగా సదానంద కాస్త ఫోకస్ చేసేసరికి ఈ టీ బిల్లుల స్కాం బయటకు వచ్చిందట. ఈ ఉదంతంపై సీరియస్ గా ఉన్న మంత్రి.. ఈ కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారో లెక్క చెప్పమని చెప్పారట. సరిగ్గా చూస్తే.. ఇలాంటి లెక్కలు మరెన్ని బయటకు వస్తాయో..?