చైనాలోని జిన్ జియాంగ్ రాష్ట్ర ప్రజలకు వర్తించేలా చైనా ఆసక్తికరమైన ఉత్తర్వులు ఇచ్చింది. ఈ రాష్ట్రంలో నివసిస్తున్న ముస్లింలు తమ పిల్లలకు మతపరమైన పేర్లు పెట్టరాదంటూ ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది. సద్దాం - జిహాద్ - ఇస్లాం - ఖురాన్ - మక్కా - ఇమామ్ - హజ్ - మదీన లాంటి పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఇలాంటి పేర్లున్న పిల్లలపై ఎలాంటి ఆస్తుల రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉండదని, దీంతో వారు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలకు - ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా మారుతారని తెలిపింది.
జిన్ జియాంగ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న ఉయ్ గుర్ తెగకు చెందిన ముస్లింలు తమ గుర్తింపునకు తరుచుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారిపై ఇలాంటి ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది. ఉయ్ గుర్ తెగకు చెందిన వారి ఆందోళన పలు సందర్భాల్లో తీవ్ర రూపం దాల్చింది. దీంతో వారిని కట్టడి చేయడానికి ముందస్తు చర్యగా నిబందనల చట్రంలో వారిని ఇరికించాలని ప్రభుత్వం భావించినట్లుగా చెప్తున్నారు. కాగా పేర్లపై షరతులు విధించడాన్ని పలు ముస్లిం సంస్థలు తప్పుపట్టాయి. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఈ ఆదేశాలు ఇచ్చిందని మండిపడ్డాయి. వ్యక్తిగత స్వేచ్ఛను అణిచివేసేలా ఈ చర్యలు ఉన్నాయని ఆక్షేపించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/