మంచిగానో.. చెడుగానో… ఏదో విధంగా మీడియాలో కనిపిస్తూ ఉండాలి. మీడియా ద్వారా జనాలకు టచ్ లో ఉండాలి. ఇదీ కొంతమంది రాజకీయ నేతల సిద్ధాంతం. ఏదో నోటికి వచ్చింది మాట్లాడటం - తమ తీరుతో విమర్శల పాలవ్వడమో చేస్తూ ఉంటారు. దాని వల్ల వారు అనునిత్యం మీడియా లో ఉంటారు. మీడియా ఫ్రెండ్లీగా పేరు తెచ్చుకుంటారు. తద్వారా జనాల దృష్టిలో పడుతూ ఉంటారు సదరు నేతలు.
గతంలో ఆనం వివేకానందరరెడ్డి ఇదే పని చేసేవారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆ కాంగ్రెస్ నేత లోటు రాజకీయాలకు ఉండనే ఉంది. తరచూ ఏదో ఒక వివాదాస్పద స్టేట్ మెంట్ ఇచ్చే వారు వివేకానందరెడ్డి. కాంగ్రెస్ లో ఉన్న రోజుల్లో అయినా, తెలుగుదేశం పార్టీలోకి చేరాకా అయినా ఆనం ఏదో ఒక హాట్ స్టేట్ మెంట్ ఇచ్చేవారు.
ఇప్పటికీ యూట్యూబ్ లో - ఫేస్ బుక్ లో ఆనం వివేకానందరెడ్డికి సంబంధించిన పాత వీడియోలు వైరల్ గానే ఉంటాయి. అలాంటి వివేకానందరెడ్డిని ఆదర్శంగా తీసుకుని చెలరేగిపోతోందట తెలుగుదేశం పార్టీ నేత సాదినేని యామిని శర్మ. ఈమె ఎవరో మొన్నటి వరకూ ఎవరికీ పెద్దగా తెలీదు. అయితే ఐదారు నెలల వ్యవధిలోనే ఈమె పేరు మార్మోగిపోతూ ఉంది.
తెలుగుదేశం పార్టీ వీర భక్తురాలిగా యామినిశర్మ హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ ఉంది. ఆమె తన స్థాయి ఏమిటో, తన కు ఉన్న గుర్తింపు ఏమిటో పట్టించుకోవడం లేదు.నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారంతే. అవాకులు చవాకులు పేలడానికి కూడా ఆమె వెనుకాడటం లేదు. ఇలాంటితీరుతో ఆమె విమర్శల పాలవుతూ ఉంది కూడా. అయితే ఏదో విధంగా మీడియాలో తన పేరు నానడం కావాలి ఆమెకు.అందుకే ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు.
సోషల్ మీడియాలో ఆమెపై సెటైర్లకు కొదవలేదు. ఎలాగైతేనేం తనకు గుర్తింపు వస్తోంది కదా అనేది ఆమె లెక్కగా కనిపిస్తోంది. అందుకే ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంది. ఏ మాత్రం సబ్జెక్టు లేకుండా మాట్లాడతారామె. ఆమెపై ప్రత్యర్థులు గట్టిగా విమర్శించలేదు. ఎందుకంటే.. లేడీ కోటాలో సానుభూతి కొట్టేస్తుంది. అందుకే ఆమె ఏం మాట్లాడినా వారు కూడా వదిలేస్తారు.
అయితే ఆనం వివేకానందరెడ్డి ప్రజాబలం కలిగిన వ్యక్తి. ఎమ్మెల్యే గా నెగ్గాకా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. కాబట్టి దానికో విలువ వచ్చింది. ఈమె ఒట్టి హాట్ కామెంట్స్ చేస్తూ పోతే..చివరకు టైంపాస్ బఠానీగా మిగిలిపోయే అవకాశాలు లేకపోలేదు!