టీడీపీ నేతలు చాలామందే ఉన్నా.. అందులో కాస్తంత డొక్క శుద్ధి ఉన్న నేతలు వేళ్ల మీద లెక్కించొచ్చు. అలాంటి నేతల్లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న వారి మరికాస్త తక్కువ. ఇక.. అలాంటి లక్షణాలు ఉన్న మహిళా నేతల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి పోలికలు చెప్పినంతనే గుర్తుకు వచ్చే మహిళా నేత సాధినేని యామిని.
తన మాటలతో సోషల్ మీడియాలో అగ్గి పుట్టించే ఆమె.. అప్పుడప్పుడు చేసే వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో కనిపిస్తుంటారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు ఒక కంప్లైంట్ చేశారు. తన పేరుతో ఒకరు ఫేక్ అకౌంట్ ఓపెన్ చేశారని.. అందులో ప్రధాని మోడీ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ఉద్దేశించి అసభ్య పోస్టులు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.
ఈ తరహా అకౌంట్ ఓపెన్ చేసిన వారి వివరాల్ని తెలుసుకోవాలని.. వారిని కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా ఆమెకు ధైర్యం చెప్పిన డీజీపీ.. తప్పనిసరిగా నిందితుల మీద చర్యలు తప్పవని స్పష్టం చేశారు. యామిని ఫిర్యాదును తీసుకున్న ఆయన.. విచారణ జరుపుతామని చెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవల ఏపీ డీజీపీ మాట్లాడుతూ.. సోషల్ మీడియాను దుర్వినియోగం చేసిన వారి విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తారని పేర్కొన్న సంగతి తెలిసిందే. మరి.. యామిని కంప్లైంట్ చేసిన వారిపై ఏపీ డీజీపీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.