శాడిస్ట్ భర్త.. ఆన్ లైన్ లో భార్యను అమ్మకానికి పెట్టాడు

Update: 2020-12-30 12:55 GMT
బంధాలు.. అనుబంధాలకు ఈ ఆధునిక సమాజంలో విలువ లేకుండా పోతోంది. మనుసులు పైసల వెంట పరిగెడుతూ విలువలు మరిచిపోతున్నారు. తాజాగా తిరుపతిలో దారుణం జరిగింది. ఓ శాడిస్టు భర్త తన భార్య నగ్న ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టడం దుమారం రేపింది.

కట్టుకున్న భార్యను డబ్బు కోసం అంగట్లో సరుకుగా సోషల్ మీడియాలో పెట్టాడు ఓ శాడిస్టు భర్త. టీటీడీలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి నాలుగు నెలల కిందటే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సమయంలోనే అమ్మాయి తల్లిదండ్రులు 10 లక్షల కట్నం.. 10 లక్షల బంగారం ఇచ్చారు.

కొద్దిరోజులు కాపురం చేసిన భర్త తనకు మరింత డబ్బు కావాలంటూ భార్యను వేధించసాగాడు. అత్తింటివారు పట్టించుకోకపోవడంతో భార్యను అమ్మకానికి పెట్టాలని డిసైడ్ అయ్యాడు.

తన భార్య నగ్న ఫొటోలను రహస్యంగా తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈమె కాల్ గర్ల్ అని.. గంటకు రూ.3వేలు అంటూ పోస్టులు పెట్టాడు. శారీరకంగానూ వేధించాడు.

భర్త వేధింపులు తట్టుకోలేని భార్య తాజాగా పోలీసులను ఆశ్రయించింది. మహిళా సంఘాలతో కలిసి భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. భార్య ఫిర్యాదుతో పోలీసులు భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Tags:    

Similar News