జ‌గ‌న్‌ ది పోరాటం - టీడీపీది అనుస‌ర‌ణ‌- సాయికుమార్‌

Update: 2018-05-06 16:19 GMT
రాజ‌కీయాలు అన్న‌వి స్వార్థం కోసం కాకుండా ప్ర‌జా ప్ర‌యోజ‌నం కోసం న‌డ‌వాల‌ని ప్ర‌ముఖ న‌టుడు, క‌ర్ణాట‌క‌లోని బాగేప‌ల్లి బీజేపీ అభ్య‌ర్థి సాయికుమార్ అన్నారు. గ‌తంలోనే ఒకసారి పోటీ చేసి ఓడిపోయిన సాయికుమార్ మ‌ళ్లీ ఈసారి పోటీలో ఉన్నారు. ఈఏడాది గెలుపు ఖాయ‌మ‌ని ధీమాగా ఉన్న సాయికుమార్ ఏపీ రాజ‌కీయాల‌పై ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేశారు. అలాగే, క‌ర్ణాట‌క ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు.

ఏపీ ప్ర‌జ‌ల‌కు ఇపుడు కావాల్సింది రాజ‌కీయం కాదు, భ‌విష్య‌త్తు. ఏపీని ఉన్న‌త స్థితికి తీసుకెళ్తాన‌ని, అమ‌రావ‌తి క‌డ‌తాన‌ని, ప్ర‌త్యేక హోదా తెస్తాన‌ని హామీ ఇచ్చిన చంద్ర‌బాబు ఈరోజు వాటిని మ‌రిచిపోవ‌డం విచార‌క‌రం.  జ‌గ‌న్ మాత్రం ఆరోజు ఈరోజు ఒకే వాద‌న‌తో ముందుకు వెళ్తుండ‌టం అత‌నిలో ప్ర‌జా క్షేమ కాంక్ష‌ను తెలియ‌జేస్తోంది అని వ్యాఖ్యానించారు. హోదాతోనే రాష్ట్ర భ‌విష్య‌త్తు అన్న ఎరుక జ‌గ‌న్‌కు ప్ర‌జామోదం తెచ్చింద‌న్నారు. త‌మ చేతికాని త‌నాన్ని చంద్ర‌బాబు-ఇత‌ర టీడీపీ నేత‌లు మోడీ మీద నెట్ట‌డం సరైన‌ది కాద‌న్నారు. ఇదే టీడీపీ నేత‌లు అమరావతి శంకుస్థాపన సందర్భంగా అన్ని చోట్లా మ‌ట్టి నీరు సేక‌రించార‌ని, మోడీ కూడా పవిత్ర జలం.. పవిత్ర మట్టి తెస్తే ఆరోజు కీర్తించి ఈరోజు అదే అంశాన్ని చుల‌క‌న చేసి మాట్లాడ‌టం చూస్తుంటే వారు ఎంత అవివేకంలో ఉన్నారో అర్థ‌మ‌వుతుంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ప్ర‌తికూల ప‌రిస్థితులు చూసి తెలుగుదేశం నేత‌లు స‌హ‌నం కోల్పోయి మాట్లాడుతున్నార‌ని సాయికుమార్ పేర్కొన్నారు. జ‌గ‌న్ చేసిన ప‌నుల‌న్నీ తాము కూడా చేస్తే మ‌ళ్లీ ప్ర‌జ‌లు న‌మ్ముతార‌నుకోవ‌డం టీడీపీ నేత‌ల అమాయ‌క‌త్వం. త‌మ కంటూ సొంత విధానాలు, ఆలోచ‌న‌లు ఉంటే త‌ప్పు ఆ పార్టీకి భ‌విష్య‌త్తు ఉండ‌ద‌న్నారు.

ఇక క‌ర్ణాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య‌పై, ప్రకాష్ రాజ్‌పై కూడా సాయికుమార్ మండిప‌డ్డారు. సిద్ధరామయ్య క‌ర్ణాట‌క‌లోనే  అసమర్థ ముఖ్యమంత్రిగా చ‌రిత్ర‌లో నిలిచిపోయార‌న్నారు.  అన్ని సమస్యల‌ను అపరిష్కృతంగా ఉంచేశార‌ని విమ‌ర్శించారు.  అందుకే ఆయ‌నను ఇంకోసారి భ‌రించే శ‌క్తి క‌ర్ణాట‌క ప్ర‌జ‌ల‌కు లేద‌ని, రాష్ట్రంలో బీజేపీ గాలి వీస్తోంద‌ని.. బీజేపీ విజయం ఖాయమని సాయికుమార్ అన్నారు.
 
ప్ర‌కాష్ రాజ్ నా స‌హ‌న‌టుడే, కానీ మోడీ ప‌ట్ల ఆయ‌న ఉద్దేశ‌పూర్వ‌క వ్య‌తిరేక‌త పెంచుకున్నార‌న్నారు.  ప్రకాశ్‌ రాజ్ ది పోరాటం కాదు, కేవ‌లం ఆవేశం. మోదీని టార్గెట్‌ చేయడం త‌ప్ప ఆయ‌న మాటల్లో ఇంకేమీ క‌న‌ప‌డ‌టం లేద‌న్నారు. దేశంలో జరిగిన ప్ర‌తి విష‌యానికి ప్రధాని మోదీనే కార‌ణ‌మనే మన‌స్త‌త్వం ఒక మాన‌సిక రోగం అవుతుంద‌ని సాయికుమార్ అన్నారు.


Tags:    

Similar News