ప‌వ‌న్ వ‌చ్చి ప్ర‌చారం చేస్తే కౌంట‌ర్ రెఢీ అట‌!

Update: 2018-05-01 17:18 GMT
క‌ర్ణాట‌క‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల హ‌డావుడి అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది. తెలుగు ప్రాంతాల‌కు చెందిన ప్ర‌జ‌లు ఏళ్ల‌కు ఏళ్లుగా క‌ర్ణాట‌క‌లో స్థిర‌ప‌డి ఉండ‌టం.. వారో పెద్ద ఓటుబ్యాంకుగా ఉన్న‌నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల‌కు చెందిన నేత‌లు ప‌లువురు క‌ర్ణాట‌క‌లో ప్ర‌చారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు.. క‌నిపించ‌ని నాలుగో సింహ‌మేరా పోలీస్ అంటూ త‌న బేస్ వాయిస్ తో తెలుగోళ్ల‌కు సుప‌రిచితులైన సాయికుమార్.

బాగేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయ‌న‌.. త‌న గెలుపు మీద ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు. గ‌తంలో ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓట‌మిపాలైన ఆయ‌న‌.. ఈసారి గెలుపు మీద బోలెడ‌న్ని ఆశ‌లు పెట్టుకున్నారు. త‌న‌కున్న స్టార్ డ‌మ్‌.. నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద ఎత్తున ఉన్న తెలుగు ఓట‌ర్ల‌తో పాటు.. మోడీ ఛ‌రిష్మా త‌న విజ‌యానికి బాట‌లు వేస్తుంద‌న్న ఆశ‌తో ఉన్నారు.

ప‌దేళ్లుగా నియోజ‌క‌వ‌ర్గం మీద దృష్టి పెట్ట‌కుండా.. ఎన్నిక‌ల వేళ రంగంలోకి రావ‌టంపై నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నార‌న్న పాయింట్‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోని సాయికుమార్‌.. త‌న ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల‌తో మాట్లాడిన ఆయ‌న‌.. మోడీ నాయ‌క‌త్వంలో క‌ర్ణాట‌క‌లో బీజేపీ విజ‌యం త‌థ్య‌మ‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన ప్ర‌చారం వేర‌ని.. ఈ రోజే (మంగ‌ళ‌వారం) మోడీ ప్ర‌చారంలోకి దిగిన నేప‌థ్యంలో రానున్న రోజుల్లో ఆయ‌న ప్ర‌భావం ఓట‌ర్ల మీద ఉంటుంద‌ని న‌మ్మ‌కంగా చెబుతున్నారు.

తెలుగువారు అత్య‌ధికంగా ఉండే బాగేప‌ల్లిలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌చారానికి వ‌స్తే అన్న ప్ర‌శ్న‌కు త‌న‌దైన శైలిలో స్పందించిన సాయికుమార్‌.. ప‌వ‌న్‌కు కౌంట‌ర్లు వేసేందుకు త‌న ద‌గ్గ‌ర సిద్ధంగా ఉన్నాయ‌ని వ్యాఖ్యానించారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో జేడీఎస్ కు ఓటు వేయాల‌ని ప‌వ‌న్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించ‌టం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సైతం.. తెలుగువారంతా జేడీఎస్ కు ఓటు వేయాల‌ని కోరారు. ప్ర‌చారానికి వ‌స్తారో.. రారో స‌రిగా తెలీని ప‌వ‌న్‌కు కౌంట‌ర్లకు రెఢీ అంటున్న సాయికుమార్.. ముందు ప్ర‌త్య‌ర్థులకు దిమ్మ తిరిగేలా కౌంట‌ర్లు వేస్తే మంచిద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.  
Tags:    

Similar News