మరణించిన 300 ఏళ్లకు మనోడికి సెయింట్ హుడ్ హోదా

Update: 2021-11-12 01:30 GMT
అతడో సాదాసీదా వ్యక్తి. హిందువుగా పుట్టి.. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వ్యక్తి. ఒక సామాన్యుడికి క్రైస్తవంలో అత్యుత్తమమైన సెయింట్ హుడ్ హోదాను సొంతం చేసుకున్న తొలి భారతీయ క్యాథలిక్ గా చెప్పాలి. ఇంతకూ అతనెవరో కాదు.. దేవ సహాయం పిళ్లై. కేరళలో జన్మించిన ఆయన.. తుదిశ్వాస విడిచిన దాదాపు 300 ఏళ్ల తర్వాత సెయింట్ హుడ్ హోదాను ఇస్తున్నట్లుగా పోప్ ఫ్రాన్సిస్ వర్గాలు వెల్లడించాయి.

వచ్చే ఏడాది మే 15న వాటికన్ లోని సెయింట్ పీటర్స్ బాసిలికాలో జరిగే కార్యక్రమంలో పోప్ ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన ఆరుగురికి ఈ సెయింట్ హుడ్ ను అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ఆరుగురిలో మనోడైన దేవ సహాయం ఒకరు. ప్రస్తుతం కేరళలో ఉన్నప్పటికీ.. దేవ సహాయం పుట్టిన సమయంలో అంటే 1712లో తమిళనాడు రాష్ట్రం పరిధిలో ఉండేది. అప్పటి ట్రావన్ కోర్ సంస్థానం పాలనలోని తమిళనాడు ప్రాంతంలో నాయర్ కుటుంబంలో దేవ సహాయం జన్మించారు.

పుట్టిన 33 ఏళ్ల తర్వాత హిందూ మతం నుంచి బయటకు వచ్చిన ఆయన.. క్రైస్తవాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన తన పేరును లాజరస్ గా మార్చుకున్నారు. ధనిక.. పేద తారతమ్యాలు లేకుండా సమాజంలో అందరికి సమాన హోదా దక్కాలని ఆయన కోరుకున్నారు. ఆయన మాటలు.. శాంతిప్రవచనాలు అప్పటి సమాజంలోని అగ్రవర్ణాల వారికి నచ్చేవి కావు. దీంతో ఆయన్ను 1749లో అప్పటి పాలకులు ఆయన్ను అరెస్టు చేశారు. అనంతరం జరిగిన కాల్పుల్లో ఆయన మరణించారు. ఆయన సేవలు.. ప్రజలకు అందించిన శాంతి సందేశాల నేపథ్యంలో మరణించిన 300 ఏళ్ల తర్వాత ఆయనకు సెయింట్ హుడ్ ను ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు.




Tags:    

Similar News