యాకూబ్ ఉరి మీద చెంప‌లేసుకున్న స‌ల్మాన్‌

Update: 2015-07-26 15:56 GMT
ముంబ‌యి పేలుళ్ల ఘ‌ట‌న‌ లో 250 మంది మ‌ర‌ణానికి కార‌ణ‌మైన యాకూబ్ మెమ‌న్‌ను ఈ నెల 30న ఉరి తీయ‌నున్న నేప‌థ్యంలో..అత‌ను కాద‌ని.. అత‌ని సోద‌రుడు త‌ప్పు చేశాడ‌ని.. అత‌న్ని తీసుకొచ్చి బ‌హిరంగంగా ఉరి తీయాలంటూ ట్వీట్ చేసి సంచ‌ల‌నం సృష్టించిన బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్‌.. తాను చేసింది ఎంత పెద్ద త‌ప్పు అన్న‌ది ఆయ‌న‌కు గంట‌ల వ్య‌వ‌ధిలోనే అర్థ‌మైంది.

స‌ల్మాన్ ట్వీట్ల‌పై ఎవ‌రో కాదు.. ఆయ‌న క‌న్న‌తండ్రి.. బాలీవుడ్ ర‌చ‌యిత అయిన స‌లీంఖాన్ సైతం కొడుకును త‌ప్పు ప‌ట్టాడు. అవ‌గాహ‌న లేకుండా మాట్లాడారంటూ విరుచుకుప‌డ్డారు.

యాకూబ్‌ను ఉరి తీయొద్ద‌ని చెబుతూ చేసిన వ్యాఖ్య‌లు.. ఎవ‌రినైనా నొప్పించి ఉంటే క్ష‌మించాల‌ని.. త‌న వ్యాఖ్య‌ల్ని వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లుగా ఆయ‌న పేర్కొన్నారు. త‌న కార‌ణంగా ఏదైనా త‌ప్పు జ‌రిగితే క్ష‌మించాల‌ని కోరుకున్నారు. త‌న‌కు న్యాయ‌వ్య‌వ‌స్ఝ మీద న‌మ్మ‌కం ఉంద‌ని.. గౌర‌వం ఉంద‌ని వ్యాఖ్యానించారు.

యాకూబ్‌కు ఉరిశిక్ష వేయ‌కూడ‌దంటూ ట్వీట్స్ పేర్కొన్న క్ర‌మంలో.. తాను మూడు రోజుల పాటు మ‌ద‌న ప‌డి మ‌రీ తానీ వ్యాఖ్య‌లు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించాడు. మూడు రోజుల మ‌ధ‌నం త‌ర్వాత చేసిన ట్వీట్స్ ను గంట‌ల వ్య‌వ‌ధిలోనే వెన‌క్కి తీసుకోవ‌టం.. త‌ప్పు చేసి ఉంటే క్ష‌మించాల‌ని చెంప‌లేసుకోవ‌టం చూసిన‌ప్పుడు.. త‌న ట్వీట్స్ ద్వారా సల్మాన్ ఎంత త‌ప్పు చేశారో ఇట్టే అర్థం కాక మాన‌దు.
Tags:    

Similar News